TS TET 2024 Exam Dates : బ్రేకింగ్ న్యూస్‌.. టెట్‌-2024 నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. ప‌రీక్ష తేదీలు ఇవే.. టెట్‌,డీఎస్సీ ద‌ర‌ఖాస్తు గడువును కూడా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఎట్ట‌కేల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం అభ్యర్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది. తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)-2024 నోటిఫికేష‌న్ ను విడుద‌ల చేసింది.

టీఎస్ టెట్‌-2024 ద‌ర‌ఖాస్తుల‌ను మార్చి 27వ తేదీ నుంచి ఏప్రిల్ 10వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు. అలాగే టెట్‌-2024 ప‌రీక్ష‌ల‌ను మే 20వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు.  ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 3 లక్షల మంది అభ్యర్థులకు డీఎస్సీ రాసే అవకాశం దక్కనుంది. అలాగే తెలంగాణ డీఎస్సీ-2024 ద‌ర‌ఖాస్తు గ‌డువును కూడా ప్ర‌భుత్వం పొడిగించింది. అలాగే డీఎస్సీ ద‌ర‌ఖాస్తు గ‌డువును జూన్ 6వ తేదీ వ‌ర‌కు పొడిగించి ప్ర‌భుత్వం.

☛ TS DSC 2024 District Wise Posts Details : జిల్లాల వారీగా 11062 టీచర్ల‌ పోస్టుల ఖాళీల వివరాలు ఇవే.. ముఖ్య‌మైన తేదీలు ఇలా..

☛ TS TET Exam Conduct Before DSC 2024 : బ్రేకింగ్ న్యూస్‌.. డీఎస్సీ-2024 కంటే.. ముందే టెట్ ప‌రీక్ష‌.. కానీ..

పోస్టుల వివ‌రాలు ఇవే..
ఇప్పటికే తెలంగాణలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలైన విషయం తెలిసిందే. 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ ప్రకటించింది. మొత్తం ఉద్యోగాల్లో 2,629 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉండగా.. 727 భాషా పండితులు, 182 పీఈటీలు, 6,508 ఎస్జీటీలు; స్పెషల్‌ ఎడ్యుకేషన్‌కు సంబంధించి 220 స్కూల్‌ అసిస్టెంట్‌, 796 ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి.

☛ తెలంగాణ డీఎస్సీ స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

#Tags