SCCL Recruitment 2024: సింగరేణిలో 327 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల, పూర్తి వివరాలు ఇవే..

సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌(SCCL) కొత్తగూడెం, 327 ఎగ్జిక్యూటివ్‌ అండ్‌ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ కేడర్‌ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

ఎగ్జిక్యూటివ్‌ కేడర్‌ కేటగిరిలో..
మేనేజ్మెంట్‌ ట్రైనీ (ఈ అండ్‌ ఎం) పోస్టు లు 42, మేనేజ్మెంట్‌ ట్రైనీ (సిస్టమ్స్‌) పోస్టులు 7,

నాన్‌ ఎగ్జి క్యూటివ్‌ కేడర్‌ కేటగిరీలో..

జూనియర్‌ మైనింగ్‌ మేనేజర్‌ ట్రైనీ  పోస్టులు 100, అసిస్టెంట్‌ ఫోర్‌ మెన్‌ ట్రైనీ (మెకానిక ల్‌) పోస్టులు 9, అసిస్టెంట్‌ ఫోర్‌ మెన్‌ ట్రైనీ (ఎలక్ట్రికల్‌) పోస్టులు 24, ఫిట్టర్‌ ట్రైనీ పోస్టులు 47, ఎలక్ట్రిషన్‌ ట్రైనీ పోస్టులు 98 పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ అయింది. 

అర్హత: సంబంధిత పోస్టును బట్టి పదో తరగతి/ ఐటీఐ/బీఈ/బీటెక్‌/డిప్లొమా/బీఎస్సీలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత

వయస్సు: 30 ఏళ్లకు మించరాదు

Neet Paper Leak Updates: 'నీట్‌' పేపర్‌ లీకేజీ.. పరీక్షకు 48 గంటల ముందే అమ్మకం


వేతనం:
ఎగ్జిక్యూటివ్‌ క్యాడర్‌లో పోస్టును బట్టి నెలకు రూ. 40,000/- 2,80,000 వరకు ఉంటుంది. 
నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ క్యాడర్‌లో పోస్టును బట్టి రూ. 40,058 నుంచి ఉంటుంది.
 


అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది
అప్లికేషన్‌ ఫీజు: రూ. 1000/ చెల్లించాల్సి ఉంటుంది. (ఎస్సీ/ఎస్టీలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది)

దరఖాస్తుకు చివరి తేది: జూన్‌ 29, 2024

మరిన్ని వివరాలకు వెబ్‌సైట్‌ www.scclmines.com ను సంప్రదించండి.

 

#Tags