Young Man Success Story : రెండేళ్లు గ్రంథాలయంలోనే.. ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టానిలా.. ఇదే నా సక్సెస్ స్టోరీ!
సాక్షి ఎడ్యుకేషన్: ప్రస్తుత కాలంలో యువతకు ఉద్యోగం దొరకడమే గగనంగా మారింది. ఒక్క పోస్టు ప్రకటిస్తేనే వేలమంది హాజరవుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమైన యువతకు ప్రతీసారి నిరాసే మిగులుతుంది. కాని, దొరికినప్పుడు మాత్రం కొందరికే అవకాశం దక్కుతుంది. అటువంటిది ఏకంగా ఈ యువకుడు ఐదు ప్రభుత్వ ఉద్యోగాలనే సాధించాడు. అసలు ఎవరితను, రెండేళ్లు ఎలా కష్టపడ్డాడు? ఇవి తెలుసుకోవాలంటే తన సక్సెస్ స్టోరీ చదవాల్సిందే..
Telangana Student : ఏపీ కోర్టులో తెలంగాణ బిడ్డ... సక్సెస్ స్టోరీ ఇదే..
మూడు పీజీలతో..
కరీంనగర్ సప్తగిరి కాలనీకి చెందినవాడు రాజ్‌శేఖర్ రావు. ఇతను ఎంఏ ఇంగ్లీష్, ఎమ్మెస్సీ బాటనీ, కెమిస్ట్రీ అని మూడు పీజీలు పూర్తి చేసుకున్నాడు. తన చదువు పూర్తి కాగానే సర్వశిక్షా అభియాన్ కోఆర్డినేటర్‌గా ఉద్యోగం రావడంతో అక్కడే విధులు నిర్వహించాడు. కాని, అక్కడ పని, తరువాత చదువు అంటే సమయం సరిపోయేది కాదని ఉద్యోగానికి రాజీనామ పలికాడు.
సరైన పుస్తకాలు లేక..
ఒక పరీక్ష రాయాలంటే సరైన పుస్తకాలు, సమయపాలన, శ్రద్ధ ఉండాలి. సమయపాలన చేసుకొని, శ్రద్ధగా తాను చదవగలడు కాని, తన వద్ద సరైన పుస్తకాల లోటు కారణంగా ఏం చేయాలో తోచక గ్రంథాలయంలోనే తన నివసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు రాజశేఖర్. ఇక పరీక్షలు రాసేవరకు తన ఇల్లు అదే అంటూ రెండు సంవత్సరాలుగా అక్కడే ఉండి చదువుకున్నాడు.
Constable Success Story : మా ఊరి నుంచి ఫస్ట్ పోలీస్ అయ్యింది నేనే.. కానీ..!
కృషి పట్టుదలతోనే సాధ్యం అయ్యింది..
జీవితంలో ఏదైనా కృషి పట్టుదలతోనే సాధ్యమవుతుంది. ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమయ్యే నేపథ్యంలో తన సోదరుగు ఐలయ్యే తనకు ఆదర్శమని తెలిపారు రాజశేఖర్. తన ప్రిపరేషన్ సమయంలో తనకు గ్రంథాలయం ఎంతగానో ఉపయోగపడిందని చెప్పుకొచ్చారు.
అక్కడ చదువుకోవాలన్న వాతావరణంలో ఉండే తోటి వారిని చూసి స్ఫూర్తి కలుగుతుందన్నాడు. తనకు కావాల్సిన పుస్తకాలన్ని లభించడంతో సన్నద్ధతకు ఎంతో ఉపయోగపడిందన్నారు. తనకు ఈ ప్రయాణంలో తన కుటుంబం, స్నేహితులు ఎంత సహకరించారో గ్రంథాలయం కూడా అంతే సహకరించిందన్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
కష్టాలను సోపానాలుగా మలుచుకోవాలి
తన వద్ద పుస్తకాలు లేక ఏం చేయాలో తోచని క్షణంలో గ్రంథాయలం ఆశ్రయంగా మారింది. ఇక్కడే ఉంటూ రోజుకు 8 నుంచి 10 గంటల వరకు చదువుకునేవాడు. జీవితంలో ఎదురైన కష్టాలను సోపానాలుగా మలుచుకుని విజయం సాధించానని చెప్పుకోచ్చాడు. జీవితంలో ఎన్ని ఇబ్బందులైనా రావొచ్చు.
Junior Civil Judge Topper Success Story : ఇక్కడ మిస్సయినా.. అక్కడ టాపర్‌గా నిలిచానిలా... కానీ..
కాని, అన్నింటినీ దాటుకొని ప్రతీ కష్టాన్ని సోపానాలుగా మార్చుకొని, ప్రతీ ఇబ్బందుల్లోనూ ఒక సరైన దారిని వెత్తుకొని నడిస్తే ఏదైనా సాధ్యమవుతుంది. మనకు తొలి ప్రయత్నంలో విఫలం ఎదురవుతుంది, రెండో ప్రయత్నంలో కూడా విఫలం ఎదురవుతుంది కాని, అందులో మనం చేసిన తప్పులను గమనించి మరోసారి అడుగు వేస్తే అప్పుడు ఖచ్చితంగా గెలుపే ఎదురవుతుంది.
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
తల్లిదండ్రుల ఆనందం..
తన కుమారుడిని ఇలా ఇంగ్లీష్ జూనియర్ లెక్చరర్ ఉద్యోగం సాధించన అభ్యర్థిగా చూడడం చాలా ఆనందంగా ఉందని రాజశేఖర్ తల్లిదండ్రులు వారి ఆనందాన్ని వ్యక్తం చేశారు. క్రమశిక్షణ, పట్టుదలతో చదివితే విజయం తథ్యమని నిరూపిస్తూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని అభినందించారు.