Lawyer to IPS Journey: న్యాయ‌వాది నుంచి ఐపీఎస్ గా విజ‌యం.. ఎలా..?

త‌న ప‌ట్టుద‌ల‌తో ప‌రీక్ష‌లు పూర్తి చేసి న్యాయ‌వాదిగా విధుల‌ను నిర్వహిస్తుంది. కాని, దారిలో తాను న్యాయ‌వాది కంటే కూడా పోలీస్ శాఖ‌లో విధులు నిర్వ‌హిస్తే ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉంటూ, వారి స‌మ‌స్య‌ల‌ను తొల‌గించ‌వ‌చ్చ‌నే నేప‌థ్యంలో ఈ దారిని ఎంచుకున్నట్లు పేర్కొన్నారు ఈ యువ‌తి. అస‌లు ఈమె ప్ర‌యాణం ఎలా సాగింది? ఐపీఎస్ కు రావాల‌న్న ఆలోచ‌న ఎందుకు వ‌చ్చింది? ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం..
Isha Singh.. double success as Lawyer then as IPS Officer

మాది ఉత్తర్‌ప్రదేశ్‌ అయినా, నాన్న వైపీ సింగ్‌ మహారాష్ట్ర కేడర్‌ ఐపీఎస్‌ కావడంతో అక్కడే స్థిరపడ్డాం. నా చదువంతా ముంబయిలోనే సాగింది. అక్కడి నేషనల్‌ లా స్కూల్‌లో న్యాయవిద్య పూర్తి చేసి బాంబే హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ అవ్వ‌గా, నేను అక్క‌డే ఉద్యోగాన్ని కొన‌సాగించాను. పారిశుద్ధ్య కార్మికులు విధిల‌ నిర్వహణలో మరణిస్తే రూ.10 లక్షలు పరిహారం ఇవ్వాలంటూ వాళ్ల తరఫున వాదించాను, ఆ కేసు గెలిచాను. ఆ గెలుపు నా జీవితంలో మరిచిపోలేని అనుభూతిగా నిలిచింది. కానీ నాన్న ప్రభావం నాపై ఎక్కువగా ఉండ‌డంతో, నేను ప్ర‌జాసేవ చేయాల‌నుకున్నాను.

➤   Women IPS Success Story: పీజీ చ‌దువుతూనే ఐపీఎస్ గా ఎంపికైన యువ‌తి..

అందుకే న్యాయవాదిగా కన్నా ఐపీఎస్‌గా చేరి మ‌రిన్ని సేవ‌లు ఎక్కువ‌గా చేయ‌వచ్చ‌ని అనిపించింది. నా దృష్టిలో ప్రజలకు సేవ చేసే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ ప్రభుత్వమే. ప్రజలకు ఏదైనా అవసరమైతే ప్రభుత్వం దగ్గరికే వస్తారు. నేరరహిత అంశమైనా సరే పోలీసులనే ఎక్కువగా ఆశ్రయిస్తారు కాబట్టి పోలీస్‌శాఖలో చేరాలనుకున్నాను. న్యాయవాద నేపథ్యముండటం నా సివిల్స్‌ సన్నద్ధతకు కలిసి వచ్చింది. 

➤   SVPNPA Director Amit Garg : వీటిపై పట్టు ఉంటేనే.. 'ఐపీఎస్' విధి నిర్వహణ పక్కాగా ఉంటుంది..

ఐపీఎస్ అవ్వాల‌ని నిర్ణ‌యించుకొని ప‌రీక్ష‌లు రాసాను. అలా, తొలి ప్రయత్నంలోనే ఐపీఎస్‌ సాధించా. విధి నిర్వహణలో క్రిమినల్‌ జస్టిస్‌ సిస్టమ్‌ను సమర్థంగా అమలు చేయడంపైనే దృష్టి సారిస్తా. ప్రస్తుతం సంప్రదాయ పద్ధతిలో చేసే నేరాలు తగ్గిపోయి.. సైబర్‌క్రైమ్‌ నేరాలు పెరిగాయి. కానీ దర్యాప్తులో ఆ కేసుల పెండెన్సీ 95 శాతం వరకుంది. దాన్ని తగ్గించడమే నా ముందున్న లక్ష్యం.

#Tags