Skip to main content

Usha Gayathri: జీవితం నాట్యానికే అంకితం.. ఈమె అందుకున్న అవార్డులు, సత్కారాలు ఇవే..

కూచిపూడి నర్తకి, గురువు మద్దాలి ఉషాగాయత్రి 69 ఏళ్ల వయసులోనూ కళకు అంకితమైన జీవితం గడుపుతున్నారు.
Special Story About Kuchipudi Nrutyakarini Maddali Usha Gayathri   Maddali Usha Gayatri

ఆమె ప్రయాణం నాట్యం. ఆమె ప్రయత్నం నాట్యకళకు జీవం పోయడం. నాలుగేళ్ల వయసు నుంచి కూచిపూడిని జీవనాడిగా చేసుకుని, 69 ఏళ్ల వయసులోనూ కళను వీడలేదు హైదరాబాద్‌ వాసి మద్దాలి ఉషాగాయత్రి. సుదీర్ఘ నృత్య ప్రయాణంలో భారత్‌తోపాటు దేశ విదేశాల్లో ఎన్నో నృత్య ప్రదర్శనలు ఇచ్చారు.

  • 4 సంవత్సరాల వయసు నుంచి కూచిపూడి నేర్చుకుంటున్నారు.
  • ప్రముఖ గురువులైన వేదాంతం జగన్నాథ శర్మ, వేదాంతం సత్యనారాయణ శర్మ, డా. వెంపటి చినసత్యం వద్ద శిక్షణ పొందారు.
  • 500కు పైగా నృత్య ప్రదర్శనలు ఇచ్చారు.
  • 200కు పైగా నృత్యాంశాలకు కొరియోగ్రఫీ చేశారు.
  • రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన గీతాంజలికి బ్యాలే రూపొందించారు.
  • 12 గంటల పాటు నిరంతరాయంగా నృత్య ప్రదర్శన చేసిన రికార్డు సృష్టించారు.
  • అనేక అవార్డులు, సత్కారాలు అందుకున్నారు.
  • డిసెంబర్ 2023లో స్ట్రోక్ వచ్చినప్పటికీ, వీల్‌చెయిర్‌ నుండి కూడా శిష్యులకు శిక్షణ ఇస్తున్నారు.
  • ఈ నెల 6న రాష్ట్రపతి చేతుల మీదుగా కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డును అందుకున్నారు.

Inspiring Story: ఏం చేస్తున్నామన్నది కాదు ముఖ్యం.. మహిళా ఆటో డ్రైవర్‌ సక్సెస్‌ స్టోరీ

ఎంతో ప్రోత్సాహం..
ఈ నృత్య ప్రయాణంలో నా జీవిత భాగస్వామి మద్దాళి రఘురామ్‌ ప్రోత్సాహం ఎనలేనిది. ఎన్నో పురస్కారాలు, సత్కారాలు అందుకున్నాను.

వాటిలో.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఆధ్వర్యంలో 2001లో అత్యంత ప్రతిష్టాత్మకమైన రాష్ట్రీయ అవార్డు ‘హంస పురస్కారాన్ని’, 2004లో తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ప్రతిభా పురస్కారం, యూరప్‌ తెలుగు అసోసియేషన్  ఆధ్వర్యంలో ఉత్తమ నర్తకిగా, న్యూయార్క్‌లో ఉత్తమ నాట్యగురువుగా, సిలికాన్  ఆంధ్ర అంతర్జాతీయ కూచిపూడి కన్వెన్షన్ లో ఆనాటి ప్రధానమంత్రి పి.వి. నరసింహారావు, మారిషస్‌ ప్రెసిడెంట్‌ చేతుల మీదుగా అవార్డులను అందుకున్నాను.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి నృత్యరత్న బిరుదుతోపాటు, ఉత్తమ నర్తకి–నాట్యగురు అవార్డులను పొందాను. 1984లో ఇండియన్  కౌన్సిల్‌ ఫర్‌ కల్చరల్‌ రిలేషన్స్ (న్యూ ఢిల్లీ) ఆధ్వర్యంలో ఉత్తమ కళాకారిణిగానూ, భారత్‌తో పాటు విదేశాల్లో నిర్వహించిన పలు అంతర్జాతీయ కూచిపూడి నృత్యోత్సవాలకు న్యాయనిర్ణేతగా సేవలందించాను.

గత డిసెంబర్‌లో స్ట్రోక్‌ వచ్చి వీల్‌చెయిర్‌లో ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది. అయినా నా కళా తపన ఆగలేదు. వీల్‌ చెయిర్‌ నుంచే విద్యార్థులకు కూచిపూడి నృత్యంలో శిక్షణను అందిస్తున్నాను. ఈ నెల 6న రాష్ట్రపతి చేతుల మీదుగా కేంద్ర సంగీత నాటక పురస్కారాన్ని వీల్‌చెయిర్‌లో ఉండే అందుకున్నాను. నా శ్వాస ఉన్నంతవరకు కళాసేవలో తరించాలని, కళలో ఔత్సాహికులను నిష్ణాతులను చేయాలన్నదే నా తపన’ అంటూ ఉషాగాయత్రి తన సుదీర్ఘ నృత్య ప్రయాణాన్ని ఎంతో ఆనందంగా మన ముందు ఆవిష్కరించారు.

Radhamani Amma: వ‌య‌సు 71 ఏళ్లు.. 11 హెవీ వాహనాల లైసెన్స్‌లతో న‌డుపుతోంది రికార్డ్‌ల చక్రం!!

Published date : 21 Mar 2024 01:47PM

Photo Stories