Skip to main content

Women IPS Success Story: పీజీ చ‌దువుతూనే ఐపీఎస్ గా ఎంపికైన యువ‌తి..

త‌న చ‌దువుతో పాటే త‌న ల‌క్ష్యాన్ని చేరే ప్ర‌యాణం చేసింది ఈ యువ‌తి. పీజీ విద్యను కొన‌సాగిస్తూనే త‌ను ఎంచుకున్న దారిలో న‌డ‌వాల‌నుకుంది. ఆ దారే ఐపీఎస్ అవ్వ‌డం. ఈ ప్ర‌యాణంలో త‌న ఎన్నో స‌వాళ్ల‌ను ఎదుర్కొని ముందుకు సాగింది. చివ‌రికి ఇలా త‌న విజయాన్ని అందుకుంది.. ఈ యువ‌తి ఐపీఎస్ కు చేరిన ప్ర‌యాణాన్ని త‌న మాటల్లోనే తెలుసుకుందాం..
Women succeeded in achieving IPS stands inspiration, "Woman celebrating success with IPS badge
Women succeeded in achieving IPS stands inspiration

నా విద్యాభ్యాసమంతా ఢిల్లీలోనే. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో బీటెక్‌ పూర్తి చేశాను. తర్వాత డేటాసైంటిస్ట్‌గా ఉద్యోగంలో చేరి మెషిన్‌లర్నింగ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రంగాల్లో పనిచేశాను. పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ కోసం సైకాలజీని ఎంచుకొని ముందుకు సాగాను. అయితే, నాకు సామాజిక సేవపై ఇష్టం ఉండేది.

➤   Success Story : ఎందుకు..? ఏమిటి..? ఎలా..? ఇదే నా స‌క్సెస్‌కు కార‌ణం..?

దాంతో పీజీ చదువుతూనే, సివిల్స్‌పై దృష్టి సారించాను. నేను పీజీ చేస్తూ సివిల్స్ కోసం సిద్ధం అవ్వ‌డం చాలా క‌ష్టంగా ఉండేది. కాని, ఏమాత్రం నిరాశ చెంద‌కుండా, ఓపికతో ప‌ట్టు వీడ‌కుండానే నేను సివిల్స్ కు ప్రిపేర్ అయ్యాను. అలా, నేను చేసిన తొలి ప్రయత్నమే నాకు 143వ ర్యాంకును తెచ్చింది. ఈ ర్యాంకుతో నేను సివిల్స్ ను సాధించి ఐపీఎస్‌కు ఎంపికయ్యాను. 

➤   Women's IPS Success Story : పెళ్లి తర్వాత కూడా ఐపీఎస్ కొట్టారిలా.. ఇప్పుడంతా వీళ్ల‌దే హ‌వా..

ప‌రీక్ష అనంత‌రం శిక్ష‌ణ ప్ర‌యాణం..

నా ప‌రీక్ష‌లు ముగిసిన వెంట‌నే, ఐపీఎస్ శిక్ష‌ణ మొద‌లైంది. అందుకోసం నేను అకాడమీలో ఇండోర్‌, ఔట్‌డోర్‌ శిక్షణలో చాలా కష్టపడ్డాను. శారీరకంగా, మానసికంగా ఎన్నో సవాళ్లను అధిగమించాను. గ్రేహౌండ్స్‌ శిక్షణలో.. నెలరోజుల జంగిల్‌ వార్‌ఫేర్‌ శిక్షణలో భాగంగా అడవిలోనే ఉన్నాం. శిక్షణ మొత్తంలో అది నాకు చాలా క్లిష్టమైన సమయంగా మారింది. శిక్షణలో రోజువారీ షెడ్యూల్‌ తీరిక లేకుండా ఉండేది. కాని, నేను నా సాయంత్రం సమయాన్ని వినియోగించుకున్నాను.

➤   Women IPS Success Stories : యూట్యూబ్‌లో వీడియోలు చూసి యూపీఎస్సీ సివిల్స్ కొట్టానిలా.. కానీ..

ఆ సమయాన్నీ వదలకుండా కష్టపడ్డాను. మొత్తం శిక్షణలో నేను బెస్ట్‌ ఔట్‌డోర్‌ ప్రొబెషనర్‌గా ఎంపికయ్యాను. ప్రతిష్ఠాత్మకమైన ‘ది ఐపీఎస్‌ ఆఫీసర్స్‌ స్వార్డ్‌ ఆఫ్‌ ఆనర్‌’ దక్కించుకొని, ఇప్పుడు దీక్షాంత్‌ పరేడ్‌కు కమాండర్‌గా వ్యవహరించబోతున్నాను. ఇకపై ఏజీఎంయూటీ కేడర్‌లో పనిచేయబోతున్నాను. పోలీస్‌ వృత్తి పట్ల మహిళల్లో చాలా అపోహలున్నాయి. కానీ మహిళల సమస్యలు తోటి మహిళలకే అర్థమవుతాయి. అందుకే అమ్మాయిలకు ఈ రంగంపై దృష్టిపెట్టాలని సలహానిస్తుంటా.

Published date : 30 Oct 2023 11:56AM

Photo Stories