Telangana Women Achieves Govt Jobs : TSPSC పరీక్షల్లో యువతి సత్తా.. ఏకంగా 4 ప్రభుత్వ కొలువులు కొట్టిందిలా.. కానీ ఈ సమయంలో మాత్రం..!q
సాక్షి ఎడ్యుకేషన్: ఒక ల్యాండరీ షాప్ నడిపే వ్యక్తి కూతురు తను. రోజూ పనికి వెళితే కాని దినం గడవదు. ఎదైనా సాధించాలంటే ఆశయం నిర్ణయించుకుంటే సరిపోదు. అంతకంటే ఎక్కువ పట్టుదల, కృషి, నమ్మకం ఉండాలి. ఒక పరీక్ష రాయాలంటే అందుకు తగిన క్లాసులు తీసుకోవడం అవసరం. కాని, ఇక్కడ ఈ యువతికి క్లాసులు తీసుకునేంత లేనందున తన సొంతంగానే అంటే.. పుస్తకాలు, యూట్యూబ్, గూగుల్ వంటి సదుపాయాలతోనే తన సందేహాలకు సమాధానాలు తెలుసుకుంది. ఇలా, ఎంతో కష్టపడితేనే నేడు ఎందరికో ఆదర్శంగా నిలిచేలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు ప్రభుత్వం ఉద్యోగాలు సాధించింది. ఒకసారి తన ప్రయాణం గురించి, తన తల్లిదండ్రుల భావాల గురించి వివరంగా తెలుసుకుందాం..
కోచింగ్ క్లాస్‌లకు వెళ్లకుండానే..
తన కృషితో నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలను దక్కించుకుంది నల్గొండ జిల్లా కట్టంగూరు మండల పరిధిలోని కల్మర గ్రామానికి చెందిన చింతల వెంకన్న, లక్ష్మి దంపతుల మూడో సంతానం తులసి చింతల తులసి. ఇప్పుడున్న కాలంలో ఎంతో మంది విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలకు పరీక్షలు రాసేందుకు ఎన్నో ప్రైవేట్ క్లాసులు తీసుకుంటున్నారు అయినప్పటికీ చాలామందికి ఉద్యోగాలు దక్కడంలేదు. ఈ తరుణంలో తులసి ఈ కోచింగ్ క్లాస్‌లకు వెళ్లకుండానే నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించింది. తన దగ్గర ఉన్న పుస్తకాలతో చదువుతూ, స్నేహితులు, ఉపాధ్యాయులతో సంభాషణ జరుపుతూ, ఏదైనా సందేహాలు కలిగితే యూట్యూబ్ లేదా గూగుల్‌లో సర్చ్ చేసి తెలుసుకుంటుంది. ఇలా, పరీక్షకు సిద్ధమై ఉన్నత మార్కులు సాధించి, నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలను గెలుచుకుంది.
లక్ష్యం చేరుకోవడం ఇలా..
జీవితంలో ఏ లక్ష్యానికి చేరుకోవాలన్న మొదటగా మన లక్ష్యం పెద్దదై ఉండాలి. మన ప్రయాణంలో ఎన్నో కష్టాలు, ఎత్తొంపులకు కూడా సిద్ధమవ్వాలి. కోచింగ్‌కు వెళ్లినా ఒక్కరినే ఫాలో అవ్వాలి. ఏదైనా పుస్తకం చదివితే పూర్తిగా చదివి అన్ని వివరాలను తెలుసుకోవాలి. ఏదైనా సందేహం ఉంటే గూగుల్‌ను లేదా, యూట్యూబ్‌ను సంప్రదించాలి. ఏ ఒక్క సందేహాన్ని కూడా వదలకూడదు.
Success Story : ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే.. 4 ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టానిలా.. కానీ..
సర్కారు కొలువే లక్ష్యంగా..
తన స్వగ్రామంలోనే సర్కారు బడిలో ప్రాథమిక విద్యను పూర్తి చేసుకొని, జేఎన్‌టీయూహెచ్‌లో బీటెక్, ఉస్మానియా యూనివర్సిటీలో ఎంటెక్‌ను పూర్తి చేసింది. ఇలా, తన చదువును పూర్తి చేసుకున్న తులసి, ఇక తన లక్ష్యంవైపుకు మళ్లింది. తన చదువు అనంతరం, ప్రభుత్వ కొలువును లక్ష్యంగా పెట్టుకున్నందున రెండేళ్లు కష్టపడి పోటీ పరీక్షలకు సిద్ధమైంది. ఇలా పరీక్షకు సిద్ధమవుతున్న సమయంలోనే తెలంగాణ ప్రభుత్వం.. టీజీపీఎస్సీ గ్రూప్-4తో పాలిటెక్నిక్ ఉపాధ్యాయురాలిగా కొలువు సాధించింది. కాని, ఆ ఉద్యోగంతో తులసికి సంతృప్తి లేదు.
దీంతో అది వదులుకొని, మరింత ఉన్నత ఉద్యోగం కోసం శ్రమించింది. కొంత సమయం అనంతరం, ఏఈ, ఏఈఈ కొలువులు ముందుకొచ్చాయి. ఈ ఉద్యోగాలను దక్కించుకునేందుకు మరింత ఎక్కువే శ్రమించాల్సి వచ్చింది. దీని కారణంగా ఇంటి ఆర్థిక ఇబ్బందులని చెప్పుకొచ్చారు తులసి. ఈ ప్రయాణంలోనే పుస్తకాలు, చిన్న చిన్న సదుపాయాల కోసం పిల్లలకు చదువు చెప్పి వచ్చిన డబ్బులతో తన పుస్తకాలను కొని తన చదువును కొనసాగించింది. ఇలా, తన కష్టంతో సంపాదించిన డబ్బుతోనే పుస్తకాలు కొనడం, హాస్టల్‌లో ఉండి చదువుకున్నారని తెలిపారు తులసి.
Jaya Sucess Story: వ్యవసాయ కుటుంబం.. మూడు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన జయ
అమ్మానాన్న మాటలే..
జీవితంలో ఎన్నో ఇబ్బందులు, కష్టాలు, ఎదురుదెబ్బలు ఎదురవుతాయని అమ్మానాన్నలు ఎప్పుడూ చెప్పేవారు. మన లక్ష్యాన్ని చేరుకునే ప్రయాణంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా గట్టిగా నిలపడాలన్నారు. ప్రతీ క్షణం ఎంతో ప్రోత్సాహించిన అమ్మానాన్నల ఆశలను నిలబెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నానని తెలిపారు తులసి.