Success Story of Delivery Boy: ఒకప్పుడు డెలివరీ బాయి.. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగి.. ఇదే తన గమ్యానికి ప్రయాణం!

ఒక వ్యక్తికి ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ, లక్ష్యాన్ని చేరుకోవాలన్న తపన ఉంటే తన కృషి, పట్టుదలతో ఎన్నటికైనా తన గమ్యానికి చేరుకోగలరు. కొందరు, వారి లక్ష్యాన్ని చేరుకునేందుకు కొన్ని సంవత్సరాలు కృషి చేసి సాధిస్తారు. అటువంటి ఒక గెలుపే ఈ యువకునిది.

ప్ర‌య‌త్నిస్తే ఎటువంటి ల‌క్ష్యాన్ని అయినా చేరుకోగ‌లం. ఎంత‌టి క‌ష్టం వ‌చ్చినా ప‌ట్టుద‌ల కృషి ఉంటే ఏదీ అసాధ్యం కాదు. ఇటువంటి మాట‌లకు నిద‌ర్శ‌నంగా నిలిచాడు ఈ యువ‌కుడు. 

Telangana Women Secures Four Government Jobs : ఒకేసారి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టానిలా. కానీ నా చూపు.. ఈ ఉద్యోగం వైపే..

జొమాటో డెలివరీ బాయిగా..

హైద‌రాబాద్‌లో జొమాటోకు డెలివ‌రీ బాయిగా ప‌ని చేస్తున్న ఇత‌ను సంగోజివాడి గ్రామానికి చెందిన బ‌ల్వంత్‌రావు. ప్ర‌స్తుతం, ఇత‌ను మూడు ప్ర‌భుత్వం ఉద్యోగాల‌ను సాధించాడు. ఇలా, ఉద్యోగం చేసుకుంటూనే ప‌రీక్ష‌ల‌కు సిద్ధ‌ప‌డి ప్ర‌భుత్వ ఉద్యోగాల‌ను సాధించే ల‌క్ష్యాన్ని చేరుకున్న ఈ యువ‌కుని విజ‌యం వెనుక ఉన్న ప్ర‌యాణం, అత‌ని క‌ష్టం, త‌దిత‌ర విష‌యాల‌ను తెలుసుకుందాం..

UPSC Civils Ranker Success Story : వ‌రుస‌గా మూడు సార్లు ఫెయిల్‌.. చివ‌రికి ఈ మాట‌ల వ‌ల్లే సివిల్స్ కొట్టానిలా..

ఆశయం కోసం తపన

సంగోజివాడ గ్రామానికి చెందిన ఈ యువ‌కుడు త‌న చ‌దువును పూర్తి చేసుకొని త‌గిన ఉద్యోగం చేసుకోవాల‌నే త‌ప‌నతో ముందుకు సాగాడు. కానీ, కుటుంబ ప‌రిస్థితుల కార‌ణంగా అత‌ను జొమాటోలో డెలివ‌రీ బాయిగా ఉద్యోగాన్ని పొంది ముందుకు సాగాడు. అలా, ఉద్యోగం చేస్తూనే త‌న లక్ష్య‌మైన ప్ర‌భుత్వ ఉద్యోగం కోసం త‌పించి సాధించేందుకు కృషి చేసాడు. అయితే, కోచింగ్ తీసుకునే స‌మ‌యం ఉండ‌క‌పోవ‌డంతో తానే స‌మ‌యానుసారం ప్ర‌భుత్వ ప‌రీక్ష‌కు సిద్ధం కావ‌డం ప్రారంభించాడు. అటు డెలివ‌రీ బాయిగా పని చేస్తూనే, ఇటు ప‌రీక్ష‌కు చ‌దివేవాడు. 

MD Shabina: ఏకకాలంలో మూడు ఉద్యోగాలకు ఎంపిక

కృషికి ఫలితం..

బ‌ల్వంత్ రావు త‌న ప‌రీక్ష‌ను పూర్తి చేసుకున్నాక ప్రభుత్వం విడుదల చేసిన ఫలితాల‌లో మూడు ఉద్యోగాల‌ను సాధించాడు. ఈ నేప‌థ్యంలో బ‌ల్వంత్ తెలంగాణాలో సాధించిన ఉద్యోగాలు... 
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్ (టీజీటీ), 
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్ (పీజీటీ), 
జూనియ‌ర్ లెక్చ‌ర‌ర్ (జేఎల్‌) 

Real Life Inspire Success Story : నైట్ వాచ్‌మన్‌గా ప‌నిచేస్తూనే.. ఒకే సారి మూడు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించానిలా.. కానీ..

అభినందనలు..

ఇలా, త‌న ప్రయాణాన్ని ఉద్యోగంతోనే కొన‌సాగించిన బ‌ల్వంత్‌కు వారి గ్రామ ప్ర‌జ‌లు, త‌ల్లిదండ్రులు ప్ర‌శంస‌లు అందించారు. ఇత‌రుల‌కు స్పూర్తిగా నిలిచిన యువ‌కునికి అంద‌రూ అభినందించారు.

Housewife Inspirational Success Story : గృహిణిగా బాధ్యతలు మోస్తూనే.. ఒకేసారి రెండు ప్రభుత్వ ఉద్యోగాల‌ను కొట్టానిలా.. కానీ..

#Tags