Skip to main content

National Children's Awards: జాతీయ బాల‌ల పుర‌స్కారాలకు ద‌ర‌ఖాస్తులు..

వివిధ రంగాల్లో రాణిస్తున్న పిల్ల‌ల‌ను త‌ల్లిదండ్రులు ప్రోత్సాహించి ఈ పుర‌స్కారాల‌కు ద‌ర‌ఖాస్తులు చేయించాల‌ని సూచించారు సంక్షేమ శాఖ సాధికార అధికారి కె.ప్రవీణ..
Parents Encouraging Children to Apply for Awards   Online applications for National Childrens Awards  Kakinada District Women and Child Welfare Department Officer K. Praveena

కాకినాడ: జాతీయ బాలల పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సాధికార అధికారి కె.ప్రవీణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సామాజిక సేవ, సాంకేతిక పరిజ్ఞానం, ధైర్యసాహసాలు, పర్యావరణం, క్రీడలు, సాహిత్యం, సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, నూతన ఆవిష్కరణలు, ప్రత్యేక నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలతో రాణిస్తున్న పిల్లలు దీనికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని వివరించారు.

ITI Admissions: ప్ర‌భుత్వ, ప్ర‌వేటు ఐటీఐ కళాశాల‌ల్లో ప్ర‌వేశాలకు ద‌ర‌ఖాస్తులు..

అటువంటి పిల్లలను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించి దరఖాస్తు చేయించాలని సూచించారు. ఆసక్తి ఉన్నవారు http://awards.gov.in వైబ్‌సైట్‌ ద్వారా జూలై 31లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఎంపికైన బాలలు రాబోయే రిపబ్లిక్‌ డే రోజున రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రత్యేక బహుమతి, ప్రశంసా పత్రం, జ్ఞాపిక అందుకుంటారని ప్రవీణ పేర్కొన్నారు.

Civil Judge Posts: జిల్లా జడ్జి నియామకాల్లో వర్టికల్‌ రిజర్వేషన్లు !

Published date : 11 May 2024 12:39PM

Photo Stories