NEET Ranker: నీట్‌లో జమ్మూకశ్మీర్ యువకుని పై చేయి.. ఇదే తన ప్రయాణం!
కష్టపడి చేసే ప్రయత్నం ఎప్పటికీ విఫలం అవ్వదు అని ఈ యువకుడు నిరూపించాడు. పేదరికంలో ఉంటూనే గొప్ప గొప్ప చదువులు చదివి ఉన్నత స్థాయిలో నిలవాలని ఆశించి దాని కోసమే కృషి చేశాడు. మొత్తానికి నీట్ పరీక్షలో 601 మర్కులు సాధించి అనుకున్న లక్ష్యాన్ని చేరాడు. ఎంతో పోటీ ఉండే ఈ మార్గాన్ని ఎంచుకొని ఏమాత్రం నిరాశ లేకుండా కుటుంబం కోసం కష్టపడుతూనే తన చదువును కూడా రెండేళ్లపాటు కొనసాగించి గమ్యానికి చేరాడు జమ్మూకశ్మీర్‌కు చెందిన ఉమర్ అహ్మద్ గనై.
ఇతని వయసు కేవలం 19 సంవత్సరాలే. కాని, ఇతను చెందిన విజయం.. ఎంచుకున్న దారి.. పడ్డ కష్టం ఎంతో గొప్పది. చిన్న వయసులోనే కుటుంబానికి సహాయ పడుతూ తన లక్ష్యానికి సన్నద్ధమవడం మామూలు విషయం కాదు. జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రదాడులు, ఎన్కౌంటర్‌లతో ఎప్పడు ఏ సమయానికి ఏం జరుగుతుందో తెలియని ప్రాంతంలో ఉంటూ ఈ యువకుడు తన చదువుకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తన చదువును రోజు వారిగా పూర్తి చేస్తూ ప్రయాణం సాగించాడు.
NIT Ranker: ఎంబీబీఎస్ కోసం నిట్‌లో పై చేయి సాధించిన విద్యార్థిని..
రోజూ ఉదయం కూలీ పని చేస్తూ, సాయంత్రం సమయంలో తన పరీక్షకు సిద్ధమవుతూ ఉండేవాడు. ఇలా రెండేళ్ల పాటు కొనసాగించాడు. ఎన్ని క్లిష్ట పరిస్థితులు ఎదురైనా తాను ఆశించిన లక్ష్యానికి చేరాలనే పట్టుదల గట్టిగా ఉండేది. ఇంతటి పరిస్థితుల్లో కూడా తన కుటుంబానికి సహాయ పడుతూనే తన చదువుకు ఎటువంటి ఆటంకం కలగనీయకుండా తన పరీక్షను పూర్తి చేశాడు.
నీట్ పరీక్ష పోటీ ఎంతో గట్టిగా నిలిచినా.. తన తెలివితో పరీక్షను సైతం జయించాడు. దేశవ్యాప్తంగా 20 లక్షల మంది విద్యార్థులతో పోటీ ఉన్నప్పటికీ గట్టి పోటీని అందించి గెలుపొందారు. ఈ పరీక్ష 720 మార్కులకు ఉండగా తను 601 మార్కులతో చాలా మంది యువతకు ఆదర్శంగా నిలిచాడు. ఈ విషయం తెలుసుకున్న తన తల్లిదండ్రులు, కుటుంబం సైతం తనకి అభినందనలు తెలియజేసారు. ఇంతటి ఆనందం దక్కడంతో వారి సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి.
ఈ విజయంపై ఉమర్ అహ్మద్ స్పందిస్తూ.. ‘‘గత రెండేళ్లు చాలా కష్టంగా గడిచింది. పొద్దున పూట కూలీగా పనిచేస్తూనే సాయంత్రం సమయాల్లో చదువుకున్నాను. ఈ రోజు నా కష్టానికి ప్రతిఫలం దక్కింది. కష్టపడి పనిచేయండి. అది ఎప్పుడూ వృథా కాదు’’ అని హర్షం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా వారి బంధుమిత్రులంతా తనకి అభినందనలు వ్యక‍్తం చేశారు.