Skip to main content

Job Offer With Record Package: ఈ నైపుణ్యాలతోనే నిట్‌ విద్యార్థికి రూ. 1.8 కోట్ల ప్యాకేజీతో ఉ‍ద్యోగం.. ఎక్కడా?

ఎంత చదువుకున్న వాడైనా, చదువులేని వాడైనా ఉద్యోగం సాధించేది మాత్రం వారికి ఉన్న పరిజ్ఞనంతోనే. విద్యార్థులకు నైపుణ్యలు కలిగి ఉంటే అదే వారిని వారు నడిచే దారితోనే గమ్యానికి చేర్చుతుంది. ఇలాగే జరిగింది ఒక బీహార్‌ విద్మార్థికి. అతను లక్షల్లో కాదు ఏకంగా కోట్ల రూపాయల ప్యాకేజీని సొంతం చేసుకున్నాడు. ఈ కథనంతో అతని గురించి, అతని నైపుణ్యాల గురించి తెలుసుకుందాం..
 A Bihar Success  story  Inspiring Success Story  Bihar Student success in achieving job offer from amazon with record package

సాధారణంగా ఐఐటీ, ఐఐఎం వంటి సంస్థల్లో చదివిన విద్యార్థులు అత్యధిక సాలరీ ప్యాకేజీలు దక్కించుకుని వార్తల్లో నిలుస్తుంటారు. అయితే నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐటీ) పాట్నా విద్యార్థి అభిషేక్ కుమార్ 2022లో అమెజాన్ (Amazon) నుంచి రూ. 1.8 కోట్ల ప్యాకేజీతో జాబ్ ఆఫర్‌ను అందుకుని రికార్డ్‌ సృష్టించాడు.

Success of Vijai Subramaniam: ఒకప్పుడు క్రెడిట్ కార్డు ఏజంట్.. రూ. 1000 కోట్ల సామ్రాజ్యాధిపతి ఎలా అయ్యాడంటే..!

అభిషేక్ కుమార్ అందుకున్న రూ.1.8 కోట్ల ప్యాకేజీనే ఇప్పటివరకు అత్యధిక శాలరీ ప్యాకేజీగా భావిస్తున్నారు.  ఐఐటీలు, ఐఐఎంల విద్యార్థులకు కూడా ఈ స్థాయిలో ప్యాకేజీ లభించలేదు. బిహార్‌లోని ఝఝా నగరానికి చెందిన అభిషేక్ కుమార్ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్‌ విద్యార్థి. 2022 ఏప్రిల్ 21న అమెజాన్‌ నుంచి తన నియామకానికి సంబంధించిన ధ్రువీకరణను అందుకున్నాడు. 2021 డిసెంబర్‌లో కోడింగ్ పరీక్షలో పాల్గొన్న అభిషేక్ కుమార్ ఆపై 2022 ఏప్రిల్ 13న మూడు రౌండ్ల ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. నివేదికల ప్రకారం.. అభిషేక్‌ని జర్మనీ, ఐర్లాండ్‌ దేశాలకు చెందిన నిపుణులు ఇంటర్వ్యూ చేశారు. బ్లాక్‌చెయిన్‌లో తనకున్న పరిజ్ఞానంతో వారిని ఆకట్టుకుని అత్యధిక ప్యాకేజీతో ఉద్యోగం సాధించాడు.

Civils Top Rankers: సివిల్స్‌లో ర‍్యాంకు సాధించి ప్రధాని ప్రశంసలు అందుకున్న విద్యార్థులు వీరే..

అభిషేక్ నైపుణ్యాలివే.. 

తన నైపుణ్యాల గురించి అభిషేక్ కుమార్ తన లింక్డ్‌ఇన్‌ ప్రొఫైల్‌లో పేర్కొన్నాడు. దాని ప్రకారం.. అభిషేక్ కుమార్‌కు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఒక సంవత్సరం అనుభవం ఉంది. Java, C++, Spring boot, Javascript, Linux తోపాటు వివిధ డేటాబేస్‌లలో అనుభవం ఉంది. నెట్‌వర్కింగ్, బ్యాకెండ్ అండ్‌  డేటాబేస్ ఇంజనీరింగ్ గురించి లోతైన పరిజ్ఞానం ఉంది.

Inspiring Mother and Son: తల్లి పడ్డ కష్టం బిడ్డ అందుకు గెలుపు.. ఇదే వారి ప్రయాణం..!

అభిషేక్ కుమార్ కంటే ముందు నిట్‌ పాట్నాకు చెందిన అదితి తివారీ ఫేస్‌బుక్ నుంచి అత్యధికంగా రూ.1.6 కోట్ల వేతన ప్యాకేజీ, పాట్నా అమ్మాయి సంప్రీతి యాదవ్ గూగుల్ నుంచి రూ.1.11 కోట్ల ప్యాకేజీని అందుకున్నారు.

Published date : 22 Dec 2023 09:27AM

Photo Stories