Foreign Language : ఫారెన్ లాంగ్వేజ్ నిపుణులకు డిమాండ్.. విదేశీ భాషల నైపుణ్యంతో ఉద్యోగాలు
విదేశాల్లో కార్యాలయాలు నిర్వహించడం సర్వసాధారణంగా మారింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న బహుళజాతి సంస్థలు.. సదరు విదేశీ భాషలపై పట్టున్న నిపుణులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. దీంతో ఫారెన్ లాంగ్వేజెస్ ఉపాధికి వేదికలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం జాబ్ మార్కెట్‌లో డిమాండ్ నెలకొన్న ఫారెన్ లాంగ్వేజెస్, నేర్చుకునేందుకు మార్గాలు, కెరీర్ అవకాశాలపై ప్రత్యేక కథనం..
ప్రస్తుత పరిస్థితుల్లో.. భాషలతోనే కెరీర్‌కు బాటలు వేసుకునే అవకాశం ఉంది. పేరున్న ఏదైనా విదేశీ భాషలో పట్టు సాధిస్తే.. దాని ఆధారంగానే కొలువులు సొంతం చేసుకోవచ్చు. విద్యార్థులు మల్టీ లాంగ్వేజ్ స్కిల్స్ పెంచుకుంటే కెరీర్‌లో మరింతగా రాణించే అవకాశం ఉంటుంది. భాషా నైపుణ్యం అంటే కేవలం ఇంగ్లిష్‌లో ప్రావీణ్యానికే పరిమితం కాకుండా.. అదనంగా ఏదో ఒక ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకుంటే మరింత ఉన్నతంగా ఎదగొచ్చు అంటున్నారు నిపుణులు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
ఈ భాషలకు డిమాండ్
ఫ్రెంచ్, జపనీస్, జర్మనీ, స్పానిష్, కొరియన్, చైనీస్ తదితర విదేశీ భాషల నిపుణులకు బహుళజాతి సంస్థల్లో భారీగా డిమాండ్ నెలకొంది. ఆయా భాషలను బట్టి వేతనాలు ఆకర్షణీయంగా ఉంటున్నాయి. నెలకు రూ.40వేల నుంచి రూ.50 వేల వరకు సంపాదించే అవకాశం ఉంది. విదేశీ భాషలను బ్యాచిలర్ డిగ్రీ స్థాయి నుంచే నేర్చుకునే వీలుంది.
29 దేశాల్లో అధికార భాష.. ఫ్రెంచ్
కెరీర్ అవకాశాలు అందించే విదేశీ భాషల్లో ఫ్రెంచ్ లాంగ్వేజ్ ముందుంటోంది. ప్రస్తుతం దాదాపు 29 దేశాల్లో అధికార భాషగా గుర్తింపు పొందిన ఫ్రెంచ్ భాషను నేర్చుకుంటే అంతర్జాతీయంగా ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. ఫ్రెంచ్‌ను అధికార భాషగా గుర్తిస్తున్న దేశాలు.. విదేశాల్లో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల కోసం ఇంగ్లిష్ నుంచి ఫ్రెంచ్‌లోకి, ఫ్రెంచ్ నుంచి ఇంగ్లిష్‌లోకి అనువదించే నిపుణుల కోసం అన్వేషిస్తున్నాయి. ప్రధానంగా ఫార్మా, బ్యాంకింగ్, రీసెర్చ్ విభాగాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంది. దీంతో ఫ్రెంచ్ భాషపై నైపుణ్యం సాధిస్తే నెలకు సగటున రూ.50 వేలతో కొలువు సొంతం చేసుకోవచ్చు.
ప్రముఖ ఇన్‌స్టిట్యూట్స్ వివరాలు: మిరిండా హౌస్,ఢిల్లీ యూనివర్సిటీ;జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఢిల్లీ, ఇఫ్లూ–హైదరాబాద్.
AP DSC Notification: డీఎస్సీ నోటిఫికేషన్.. ఎస్‌జీటీ పోస్టులే అధికం, గుర్తించిన ఖాళీలివే!
జపనీస్.. కెరీర్‌కు జయం
జపనీస్.. ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ నెలకొన్న లాంగ్వేజ్! మన దేశంలోని పలు రంగాల్లోని సంస్థలు జపాన్‌కు చెందిన దాదాపు మూడు వందలకు పైగా సంస్థలతో సంయుక్త భాగస్వామ్యంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. దీంతో ఈ సంస్థలకు భారీ సంఖ్యలో అనువాదకుల అవసరం ఏర్పడుతోంది. అదే విధంగా జైకా (జపాన్, ఇండియా కోఆపరేటివ్ ఏజెన్సీ) ద్వారా జపాన్, భారత్‌ల మధ్య అధికారికంగా పలు ద్వైపాక్షిక ఒప్పందాలు జరుగుతున్నాయి.
ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లు: జేఎన్‌యూ–ఢిల్లీ, ఇన్‌స్టిట్యూట్ ఫర్ కెరీర్ స్టడీస్ వైఎంసీఏ, ఢిల్లీ యూనివర్సిటీ, నిహోంగో–బషి (nihongobashi).
TET 2025 Information Bulletin: టెట్ బులెటిన్ విడుదల రేపు.. దరఖాస్తు, పరీక్షల తేదీలు ఇవే..
విద్య, ఉపాధికి జర్మన్
కెరీర్ పరంగానే కాకుండా అకడమిక్‌గా కూడా జర్మన్ లాంగ్వేజ్ ప్రాధాన్యం సంతరించుకుంది. జర్మనీలోని యూనివర్సిటీల్లో ఉన్నత విద్య కోర్సుల్లో చేరాలనుకునే విదేశీ విద్యార్థులకు జర్మన్ భాషపై అవగాహన తప్పనిసరి అనే నిబంధన ఉంది. అదేవిధంగా మన దేశంలోని సంస్థలు పరిశోధన, తయారీ రంగాలకు సంబంధించి జర్మనీలోని సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జర్మన్ భాషా నైపుణ్యం ఉంటే.. విద్య, ఉపాధి అవకాశాలు దక్కించుకోవచ్చు. మరోవైపు నైపుణ్యం కలిగిన భారతీయులకు ఇచ్చే వీసాల సంఖ్యను 20 వేల నుంచి 90 వేలకు పెంచుతున్నట్లు జర్మనీ తాజాగా ప్రకటించింది. దీంతో జర్మన్ భాషా నైపుణ్యాలున్న వారు ఆ దేశంలో తేలిగ్గా ఉద్యోగాలు దక్కించుకునే అవకాశముంది.
ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లు:
–గొయెత్ జర్మన్, –ఇన్‌లింగ్వా (Inlingua).
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
యూఎన్, ఈయూ అధికారిక భాష.. స్పానిష్
ఇటీవల కాలంలో ప్రాధాన్యం సంతరించుకుంటున్ను మరో విదేశీ భాష.. స్పానిష్.
ఇది యూఎన్‌ఓ, యూరోపియన్ యూనియన్ వంటి ప్రముఖ సంస్థల్లోనూ అధికారిక భాషగా ఉంది. దీంతో స్పానిష్ లాంగ్వేజ్ నిపుణులకు అంతర్జాతీయంగా డిమాండ్ నెలకొంది. మన దేశానికి చెందిన సంస్థలు.. స్పానిష్ స్పీకింగ్ కంట్రీస్‌గా పేర్కొనే లాటిన్ అమెరికా, అర్జెంటీనా, కొలంబియా తదితర దేశాలతో పలు ఒప్పందాలు చేసుకొని కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇది కూడా కెరీర్ అవకాశాల పెరుగుదలకు దోహదపడుతోంది.
ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లు/యూనివర్సిటీలు: స్కూల్ ఆఫ్ లాంగ్వేజ్, లిటరేచర్ అండ్ కల్చరల్ స్టడీస్, జేఎన్‌యూ, ఐ.పి.కాలేజ్ ఫర్ ఉమెన్, ఢిల్లీ యూనివర్సిటీ, జవహర్‌లాల్ నెహ్రూ అకాడమీ ఫర్ ఫారెన్ లాంగ్వేజెస్,
ఇన్‌లింగ్వా (Inlingua).
అకడెమిక్ కోర్సులకు మార్గం
సంప్రదాయ యూనివర్సిటీలు మొదలు స్పెషలైజ్డ్ ఇన్‌స్టిట్యూట్స్ వరకు ఎన్నో శిక్షణ సంస్థలు ఫారిన్ లాంగ్వేజెస్ కోర్సులను అందిస్తున్నాయి. ఇవి సర్టిఫికెట్ స్థాయి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయి వరకు పలు కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నాయి. సర్టిఫికెట్ స్థాయి కోర్సుల కాల వ్యవధి మూడు నుంచి ఆరు నెలల వరకూ ఉంటోంది. పీజీ, పీహెచ్‌డీ స్థాయిలో ఇఫ్లూ, జేఎన్‌యూ, ఢిల్లీ యూనివర్సిటీ వంటి ప్రముఖ యూనివర్సిటీలు ప్రత్యేకంగా ఫారెన్ లాంగ్వేజ్ కోర్సులను అందిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రా యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ తదితర విశ్వవిద్యాలయాలు సైతం విదేశీ భాషల కోర్సులను అందిస్తున్నాయి.
OU Distance Education : ఓయూ దూరవిద్యలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు
ఉపాధి అందించే రంగాలు
ఫార్మా, ఐటీ, ఆటోమొబైల్, కేపీఓ, ఎల్‌పీఓ, కన్సల్టింగ్.. ఇలా ఉత్పత్తి రంగం మొదలు సర్వీసెస్ సెక్టార్‌లోని ప్రముఖ సంస్థల వరకూ.. అనేక కంపెనీలు విదేశీ భాషా నిపుణులను నియమించుకుంటున్నాయి. హాస్పిటాలిటీ, టూరిజం, ఫార్మాస్యుటికల్ సంస్థలు, రాయబార కార్యాలయాలు, సాఫ్ట్‌వేర్ కంపెనీలు, బీపీఓ సంస్థలు, ఎగుమతి, దిగుమతి సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. విదేశీ భాషలు నేర్చుకున్న వారు ఫ్రీలాన్సింగ్ విధానంలో అనువాదకులుగా పనిచేసి ఆదాయం పొందే అవకాశం ఉంది.
నెలకు రూ.50వేల వేతనం
విదేశీ భాష నైపుణ్యం ద్వారా టూరిజం మొదలు తయారీ, ఐటీ, బీపీఓ, కేపీఓ, ఎల్‌పీఓ విభాగాల వరకూ.. వివిధ రంగాల్లో కొలువులు దక్కించుకోవచ్చు. వీరికి సగటు వేతనం నెలకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఉంటోంది. సంబంధిత లాంగ్వేజ్‌లో పీజీ స్థాయి సర్టిఫికెట్ ఉంటే.. ఉత్పత్తి రంగం, ఐటీ, కేపీఓల్లో నెలకు రూ.50 వేల వేతనం ఖాయం.
Osmania University: ఎంబీఏ సాయంకాలపు కోర్సుల ప్రవేశ పరీక్ష వాయిదా