Naveen Mittal: ఓయూ విద్యార్థుల విదేశీ విద్యకు ఉపకార వేతనం

ఉస్మానియా యూనివర్సిటీ: ఉన్నత చదువుకు విదేశాలకు వెళ్లే ఓయూ విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేయనున్నట్లు గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ కెరీర్‌ ఫోరం చైర్మన్, తెలంగాణ కాలేజియేట్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ తెలిపారు.
ఓయూ విద్యార్థుల విదేశీ విద్యకు ఉపకార వేతనం

ఓయూ దూరవిద్య కేంద్రం సెమినార్‌ హాల్‌లో జూన్‌ 8న ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉస్మానియా, జీఈసీఎఫ్‌ ఈ మేరకు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ సందర్భంగా నవీన్‌ మిట్టల్‌ మాట్లాడుతూ విదేశాలకు వెళ్లి ఉన్నత విద్యను ఆర్జించాలనుకునే ఓయూ విద్యార్థులకు జీఈసీఎఫ్‌ ద్వారా ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ క్వాలిఫికేషన్‌ ఉపకార వేతనాలను అందజేయనున్నట్లు పేర్కొన్నారు.

చదవండి: Foreign Education: విదేశీ విద్యకు రాష్ట్ర ప్రభుత్వం చేయూత

గతేడాది 150 మందికి ఉపకార వేతనాలను అందజేశారని, ఈ ఏడాది 1500 మందికి అందజేయనున్నట్లు వివరించారు. ఇప్పటివరకు 500 మంది విద్యార్థులు ఉపకార వేతనాలకు ఎంపికైనట్టు తెలిపారు. ఓయూ హెచ్‌ఆర్‌డీసీ, జీఈసీఎఫ్, కాలేజియెట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ నడుమ త్రైమాసిక ఒప్పందం కుదిరినట్టు వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యమండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి, ఓయూ హెచ్‌ఆర్‌డీసీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ స్టీవెన్‌సన్, జీఈసీఎఫ్‌ కార్యదర్శి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

చదవండి: Educational Testing Service: జీఆర్‌ఈ పరీక్ష ఇకపై ఇన్ని గంటల్లోనే పూర్తి చేయొచ్చు

#Tags