TSRTC 3000 Jobs Notification 2024 Details : గుడ్‌న్యూస్.. 3000 ఆర్టీసీ ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం.. వెంటనే భర్తీ ప్రక్రియకు కూడా..
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీలో 3,000 ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు సంస్థ ఎండి సజ్జనార్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు. బస్సుల్లో సిబ్బంది కొరత లేకుండా 3 వేల ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదన పంపినట్లు, ప్రభుత్వం అనుమతించిన వెంటనే భర్తీ ప్రక్రియ కూడా చేపడతామని ప్రకటించారు.
మహిళలకు ఉచిత బస్ టికెట్ పథకం అయిన మహాలక్ష్మి పథకం అమలుకు ముందు రోజుకు 45 లక్షల మంది ప్రయాణిస్తే, పథకం అమలు తర్వాత రోజుకు 55 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారని తెలిపారు.
త్వరలోనే 2,000 డీజిల్ బస్సులు, 990 ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయనున్నట్లు పేర్కొన్నారు.
భర్తీ చేయనున్న పోస్టులు ఇవే..
8 వేల మంది డ్రైవర్లు, కండక్టర్లను నియమించుకోవాలని నిర్ణయించి ప్రభుత్వానికి ఆర్టీసీ ప్రతిపాదించింది. అన్ని నియామకాలు వద్దని ఆర్థికశాఖ మౌఖికంగా సూచించంతో 3 వేల పోస్టుల భర్తీకి మళ్లీ ప్రతిపాదించింది. ఇందులో 2 వేల మంది డ్రైవర్లు ఉండగా శ్రామిక్‌లు, డిపో మేనేజర్లు ఇలా మిగతా విభాగాలకు చెందిన మరో వెయ్యి మంది ఉన్నారు. సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇస్తే పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు మూడు వేల ఆర్టీసీ ఖాళీల భర్తీ ప్రక్రియ చేపడతారు.