6000 Above TS Gurukulam Jobs 2024 Notification : 6000ల‌కు గురుకులం ఉద్యోగాలు.. వీటికి నోటిఫికేష‌న్ ఎప్పుడంటే..?

సాక్షి ఎడ్య‌కేష‌న్ : తెలంగాణ‌లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సాధారణ సంక్షేమ గురుకులాల్లో 6000 ఉద్యోగాల‌కు పైగా పోస్టులకు త్వ‌ర‌లోనే నోటిఫికేష‌న్ ఇచ్చే అవ‌కాశం ఉంది. రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో భారీగా ఉద్యోగ ఖాళీలున్నాయి. 2025-26 జాబ్‌ క్యాలెండర్‌లో వీటిని చేర్చి భర్తీ చేయనున్నారు.

ఈ గురుకులాల్లో ఎక్కువ‌గా బ్యాక్‌లాగ్‌ పోస్టులు ఉన్నాయి. గతేడాది ఈ పోస్టులకు స‌రైన స‌మ‌యంలో ప్రతిపాదనలు సమర్పించకపోవడంతో భర్తీకి అనుమతి లభించలేదు. ఈ పోస్టులన్నీ కలిపితే గురుకులాల్లో దాదాపు 6000 వేలకు పైగా కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

అలాగే వచ్చే ఏడాది కొత్త డీఎస్సీ నియామకాల తర్వాత గురుకులాల్లోని ఖాళీలన్నిటిని ఒకేసారి మెగా నోటిఫికేషన్ వెలుపడుతుందని సంక్షేమ వర్గాలు భావిస్తున్నాయి.

#Tags