Singareni Jobs: సింగరేణిలో భారీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌.. 813 పోస్టులు ఈ ఉద్యోగుల ద్వారా భర్తీ!

గోదావరిఖని: సింగరేణిలో మరో భారీ ఉద్యోగాల భర్తీకి యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి దఫాగా ఉద్యోగాల భర్తీకి మార్చి 6న నోటిఫికేషన్‌ జారీ చేసిన యాజమాన్యం కేవలం 8రోజుల వ్యవధిలోనే మరో నోటిఫికేషన్‌ ఇచ్చింది.

 సంస్థలో ఖాళీగా ఉన్న 327 పోస్టులను ప్రత్యక్ష నియామకాల పద్ధతిలో బయటి అభ్యర్థుల ద్వారా, 813 పోస్టులను సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల ద్వారా భర్తీ చేసేందుకు మార్చి 14న‌ ఉత్తర్వులు జారీ చేసింది. ఈపోస్టుల కోసం ఏప్రిల్‌ 15 నుంచి మే 5వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది.

పూర్తి వివరాల కోసం ఏప్రిల్‌ 15 తేదీ నుంచి సింగరేణి సంస్థ వెబ్‌సైట్‌ (https:// scclmines.com)లో చూసుకోవాలని తెలిపారు. ఇంటర్నల్‌ పోస్టుల కోసం మార్చి 20 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం మార్చి 20వ తేదీ నుంచి సింగరేణి సంస్థ వెబ్‌సైట్‌ (https://scclmines. com)లో చూడవచ్చని తెలిపారు.

చదవండి: Good News for Singareni Employees: సింగరేణి వర్కర్లకు ఉన్నత స్థాయి ఉద్యోగాలు

ఇటీవల ఇచ్చిన నోటిఫికేషన్‌

సింగరేణి యాజమాన్యం మార్చి 6న సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ జారీ చేసింది. మొదటి నోటిఫికేషన్‌లో 173 అంతర్గత పోస్టులు, రెండో నోటిఫికేషన్‌లో 813, ఎక్స్‌టర్నల్‌ విభాగంలో మొదటి నోటిఫికేషన్‌లో 272, రెండో నోటిఫికేషన్‌లో 327పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

ఈలెక్కన 986ఇంటర్నల్‌, 599 ఎక్స్‌టర్నల్‌ పోస్టుల భర్తీకి సిద్దం చేసింది. మరో 200పోస్టులను ప్రమోషన్స్‌ పద్దతిలో అతిత్వరలో భర్తీ చేస్తామని ప్రకటించారు. అలాగే 60ఈపీ ఆపరేటర్ల పోస్టుల భర్తీ చేస్తామని తెలిపారు.

నేరుగా భర్తీ చేసే ఉద్యోగాలు

ఎగ్జిక్యూటివ్‌ క్యాడర్‌

ఈఅండ్‌ఎం మేనేజ్‌మెంట్‌ ట్రైయినీ: 42
సిస్టమ్స్‌ మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ: 7
నాన్‌–ఎగ్జిక్యూటివ్‌ క్యాడర్‌

జేఎంఈటీ జూనియర్‌ ఇంజనీర్‌ ట్రెయినీ: 100
మెకానికల్‌ అసిస్టెంట్‌ ఫోర్‌మెన్‌ ట్రెయినీ: 09
ఎలక్ట్రికల్‌ ఆసిస్టెంట్‌ ఫోర్‌మెన్‌ ట్రెయినీ: 24
ఫిట్టర్‌ ట్రెయినీ: 47
ఎలక్ట్రీషియిన్‌ ట్రెయినీ: 98

సింగరేణి ఉద్యోగులతో భర్తీ పోస్టులు

ఎగ్జిక్యూటివ్‌ క్యాడర్‌
మైనింగ్‌ గ్రాడ్యుయేట్‌ ట్రెయినీ: 22
అండర్‌ మేనేజర్‌: 20
జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌: 06
నాన్‌ఎగ్జిక్యూటివ్‌ క్యాడర్‌
జూనియర్‌ ఆసిస్టెంట్‌: 360
జూనియర్‌ మైనింగ్‌ఇంజనీర్‌ ట్రెయినీట్రైనీ: 100
ట్రెయినీ ఆసిస్టెంట్‌ ఫోర్‌మెన్‌(మెకానికల్‌): 10
అసిస్టెంట్‌ ఫోర్‌మెన్‌(ఎలక్ట్రికల్‌): 25
ట్రెయినీ ఫిట్టర్‌: 123
ట్రెయినీ ఎలక్ట్రీషియన్‌: 133
ట్రెయినీ వెల్డర్‌ ట్రైనీ పోస్టులు: 14

  • సింగరేణిలో భారీగా రిక్రూట్‌మెంట్‌కు శ్రీకారం
  • ఇంటర్నల్‌ 813 పోస్టులు, ఎక్సటర్నల్‌ 327పోస్టులు

మెరిట్‌ ఆధారంగా ఎంపిక

పోస్టులన్నీ వ్రాతపరీక్ష ఆధారంగా పూర్తిగా మెరిట్‌పై ఆధారపడి ఉంటుంది. దళారులను నమ్మి ఎవరు మోసపోవద్దు. ఎవరైనా సామాజిక మాధ్యమాల్లో మెసేజ్‌, ఫోన్‌ చేసి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే వారివద్ద ప్రలోభాలకు గురికావద్దు. వెంటనే ఏసీబీ, సింగరేణి విజిలెన్స్‌కు సమాచారం అందించాలి. వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం.
– ఎన్‌.బలరాం, సీఅండ్‌ఎండీ, సింగరేణి
 

#Tags