Singareni Apprenticeship 2024 Applications : సింగరేణిలో అప్రెంటీస్‌ల‌కు ద‌ర‌ఖాస్తులు... అర్హ‌త‌లు ఇవే...

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌లోని సింగరేణి సంస్థలో ఐటీఐ పూర్తి చేసిన యువతీ, యువకులు 2024-25 విద్యా సంవత్సరానికి గాను అప్రెంటిస్ షిప్ కోసం దరఖాస్తులను స్వీక‌రిస్తున్నారు.

ఈ మేర‌కు ఆర్జీ-2 ఏరియా జీఎం ఎల్వీ సూర్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. 

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేదీ ఇదే..
ఐటీఐలో వివిధ విభాగాల్లో చదువుకున్న అభ్యర్థులకు మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ ప్రెన్యూర్షిప్ (minister of skill development and entrepreneurship) హైదరాబాద్ ఆదేశాల మేరకు సింగరేణి సంస్థ నేషనల్ అప్రెంటిస్ షిప్ ప్రమోషన్ స్కీం వెబ్ పోర్టల్లో వివరాలను పొందుపరిచినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సింగరేణి కార్మిక కుటుంబాల పిల్లలు, ప్రభావిత గ్రామాల పిల్లలు సద్వినియోగం చేసుకుకోవాలన్నారు. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి 23వ తేదీ వరకు వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.

#Tags