‘KGBV’ మెరిట్‌ జాబితా విడుదల

నల్లగొండ: కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు, అర్బన్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ప్రత్యేక అధికారులు, పీజీసీఆర్‌టీలు, సీఆర్‌పీలు, నర్సింగ్‌, పీఈటీ పోస్టులకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారి మెరిట్‌ జాబితాను పాఠశాల విద్యాశాఖ ప్రకటించిందని డీఈఓ భిక్షపతి ఆగ‌స్టు 10న‌ ఒక ప్రకటనలో తెలిపారు.
‘KGBV’ మెరిట్‌ జాబితా విడుదల

మెరిట్‌ జాబితాలోని అభ్యర్థులకు 1.3 నిష్పత్తి ప్రకారం డీఈఓ కార్యాలయంలో ఆగ‌స్టు 11న‌ ఉదయం 10 గంటలకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ఉంటుందని పేర్కొన్నారు. ఆయా పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ప్రత్యేక అధికారులు, పీజీసీఆర్‌టీలు, సీఆర్‌పీలు, నర్సింగ్‌, పీఈటీ పోస్టులకు ఆన్‌లైన్‌ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నరని తెలిపారు. ఫోన్‌ కాల్‌ వచ్చిన అభ్యర్థులంతా ఒరిజినల్‌ సర్టిఫికెట్లతోపాటు, జిరాక్స్‌ కాపీలతో హాజరు కావాలని కోరారు.

చదవండి:

No Admissions: అడ్మిషన్లు ఫుల్‌

KGBV: నాణ్యమైన విద్యకు కేరాఫ్‌ అడ్రస్‌గా కేజీబీవీ.. బోధనలో ఠీవి

#Tags