Jobs: ఆప్కోలో ఉద్యోగ అవకాశాలు.. నేరుగా ఇంటర్వ్యూలు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లోని ఆప్కో చేనేత వస్త్ర విక్రయశాలల్లో మేనేజర్లు, అమ్మకాల సహాయకులుగా పనిచేయడానికి అర్హత కలిగిన వారిని నేరుగా ఇంటర్వ్యూకి ఆహ్వానిస్తున్నట్లు సంస్థ వైస్‌ చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎం.ఎం.నాయక్‌ జూన్‌ 30న ఒక ప్రకటనలో తెలిపారు.
ఆప్కోలో ఉద్యోగ అవకాశాలు.. నేరుగా ఇంటర్వ్యూలు

సుమారు 15 పోస్టులను భర్తీచేయనున్నట్టు తెలిపారు. విక్రయరంగంలో ఆసక్తి కలిగి ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణతతో మంచి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అర్హులని పేర్కొన్నారు. అభ్యర్థులు పూర్తి వివరాలు కలిగిన బయోడేటాతో జూలై మూడోతేదీ ఉదయం 11 గంటలకు విజయవాడ  గవర్నర్‌పేటలోని రహమాన్‌ పార్క్‌ దగ్గరలోగల ఆప్కో కేంద్ర కార్యాలయంలో ఇంటర్వ్యూకు హాజరుకావాలని సూచించారు.

చదవండి: AP SSC Board Recruitment 2023: ఏపీ ఎస్‌ఎస్‌సీ బోర్డులో జూనియర్‌ అసిస్టెంట్‌/డేటా ప్రాసెసింగ్‌ పోస్టులు

ఎంపికైనవారికి కనిష్టంగా రూ.9 వేలకుపైగా, వారి పనితీరు ఆధారంగా వేతనం నిర్ణయించనున్నట్లు తెలిపారు. ఆప్కో సంస్థ, విక్రయశాలల పూర్తి సమాచారాన్ని www.apcohandlooms.com వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.

చదవండి: 7,500 Jobs in SSC CGL: ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, సిలబస్‌ అంశాలు, విజయానికి ప్రిపరేషన్‌ గైడెన్స్‌...

#Tags