Good News For Government Employees : కొత్త సంవ‌త్స‌రం సంద‌ర్భంగా.. ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌..ఇక‌పై జీతాలు ఈలోపే..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు తెలంగాణ ముఖ్య‌మంత్రి కొత్త సంవ‌త్స‌రం సంద‌ర్భంగా గుడ్‌న్యూస్ చెప్పారు. గత సర్కారులో జీతాలు ఆలస్యంగా ఇచ్చేవారని ప్రభుత్వ ఉద్యోగుల్లో అసంతృప్తి ఉన్న విషయం తెలిసిందే.

అయితే.. రేవంత్ రెడ్డి సర్కారు మాత్రం అలాంటి అసంతృప్తులకు చోటు ఇవ్వకుండా.. ఉద్యోగులు ఉత్సాహంగా పని చేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. జనవరి 5లోపే జీతాలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం.

ఇప్పటికే రేవంత్ సర్కార్...

ఇక‌పై ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆపయినా సరే.. ప్ర‌తి నెల 5వ తారీఖులోపే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు వేయాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద ఎత్తున మద్దతు తెలిపారని భావిస్తోన్న ప్రభుత్వం. జీతం సరైన సమయానికి ఇచ్చి వారిని సంతోషపరిచేందుకు అడుగులు వేస్తున్నట్టు సమాచారం.ఇప్పటికే రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే.. అన్ని శాఖల్లో పెద్ద ఎత్తున బదిలీలు చేపట్టిన సర్కార్.. నిత్యం సమీక్షలు నిర్వహిస్తూ అధికారులను పరుగులు పెడుతోంది.

☛ TS Mega DSc Notification : సీఎం రేవంత్‌రెడ్డి కీల‌క నిర్ణ‌యం.. మెగా డీఎస్సీ ద్వారా టీచరు పోస్టుల భర్తీ.. మొత్తం ఎన్ని పోస్టుల‌కంటే..?

వివిధ ప్ర‌భుత్వ‌ శాఖ‌ల్లో ఖాళీగా ఉన్న ప్ర‌భుత్వ ఉద్యోగాల‌ను..

అధికారులు అప్రమత్తంగా పని చేయాలని.. విధుల్లో నిర్లక్ష్యం పనికి రాదని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సరైన సమయంలో జీతాలు ఇస్తే.. ఉద్యోగులు కూడా ఉత్సాహంగా సేవలందించనున్నట్టు ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే.. జనవరి 5లోపే జీతాలు ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. కేవలం జనవరి నెలకే పరిమితం కాకుండా.. ఇలా ప్రతి నెలా 5 లోపే జీతాలు చెల్లించాలని ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే వివిధ ప్ర‌భుత్వ‌ శాఖ‌ల్లో ఖాళీగా ఉన్న ప్ర‌భుత్వ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌ల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించిన విష‌యం తెల్సిందే.

#Tags