AP Government Job 2024 : గుడ్‌న్యూస్.. ఏపీ ప్ర‌భుత్వం 982 పోస్టులను మంజూరు.. ఈ ఉద్యోగాల‌ను త్వరగా భర్తీ చేసుకోవాలని ఆదేశాలు..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం మ‌రో గుడ్‌న్యూస్ చెప్పింది. రానున్నసాధారణ ఎన్నికల పటిష్ట నిర్వహణకుగాను జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయం(కలక్టరేట్లు), అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలకు 982 పోస్టులను మంజూరు చేశారు.

ఈ పోస్టులను త్వరగా భర్తీ చేసుకోవాలని జిల్లా కలక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి జ‌న‌వ‌రి 25వ తేదీ (గురువారం) ఆదేశించారు.

మూడేళ్ళు సర్వీసు పూర్తి చేసుకున్న..

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనాతో కలిసి ఆయన ఎన్నికల సన్నద్ధతపై జిల్లా కలక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ.. ఎన్నికలతో సంబంధం ఉండి మూడేళ్ళు సర్వీసు పూర్తి చేసుకున్న వివిధ శాఖల అధికారుల బదిలీ ప్రక్రియ దాదాపు పూర్తయిందని పేర్కొన్నారు. ఇప్పటికే పిఆర్ అండ్ ఆర్డీ, ఎక్సైజ్, స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరోల్లో బదిలీల ప్రక్రియ పూర్తి అయిందని అన్నారు. పోలీస్,రెవెన్యూ శాఖల్లో కొంత మేరకు బదిలీలు జరగా మిగాతా బదిలీలు ఒకటి రెండు రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. అదే విధంగా మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖలో బదిలీలు కూడా రెండు రోజుల్లోగా పూర్తి చేయాలని సిఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు.

☛ Good News.. APPSC Jobs Increase 2024 : భారీగా పెరిగిన ఏపీపీఎస్సీ ఉద్యోగాలు.. అలాగే ఈ పోస్టులు కూడా..

ఈ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనా మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వివిధ లాజిస్టిక్ ఏర్పాట్లకు ఇప్పటి నుంచే తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు.ఇంకా ఎన్నికల సన్నద్ధకు సంబంధించి తీసుకోవాల్సిన ఇతర అంశాలపై కలెక్టర్లకు వివరించారు.

#Tags