AP Anganwadi workers Good News : అంగన్‌వాడీల సంబరాలు.. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా మాకు కూడా..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సమ్మె చేస్తున్న అంగన్‌వాడీ సిబ్బందికి ప్రభుత్వం వరాలు ఇవ్వడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంతో జ‌న‌వ‌రి 23వ తేదీ (మంగళవారం) గూడూరు నియోజకవర్గంలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాలు ప్రారంభించి, సంబరాలు చేసుకున్నారు. అనంతరం చిన్న పిల్లలు, గర్భిణులకు ప్రభుత్వం సరఫరా చేసే పౌష్టికాహారం అందజేశారు.

గూడూరు పట్టణంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద అంగన్‌వాడీ సిబ్బంది కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకుని, తమ కోర్కెలు అంగీకరించిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా..
ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా మా సర్వీసును కూడా 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. అలాగే చనిపోయిన అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాల దహన ఖర్చులకు రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. మా కేసులు ఎత్తి వేస్తామని చెప్పడం ఆనందంగా ఉంది.
                                                                                            – ప్రభావతి, రూరల్‌ కార్యదర్శి

మా కోర్కెలు తీర్చడంతో పాటు..
సమ్మె సమయంలో మమ్మల్ని కష్ట పెట్టినప్పటికీ చివరికి మమ్మల్ని తోబుట్టువులుగా భావించి, మా కోర్కెలు తీర్చడంతో పాటు, మాపై పెట్టిన కేసులను ఎత్తి వేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎంతో సంతోషంగా ఉంది. – ఇంద్రావతి, రూరల్‌ అధ్యక్షురాలు,
అంగన్‌వాడీ వర్కర్ల సంఘం

మంత్రి బొత్స సత్యనారాయణ మాట‌ల్లో..
☛ అంగన్వాడీల 11 డిమాండ్లలో  10 ఇప్పటికే పరిష్కారం చేశాం
☛  జూలైలో జీతాలు పెంచుతాం 
☛ ఉద్యోగ విరమణ సమయంలో ఇచ్చే ప్రయోజనాన్ని 50 వేల నుంచి లక్షా 20 వేల రూపాయలకు పెంచాం
☛ హెల్పర్ కు 60 వేలకు పెంచాలని నిర్ణయం తీసుకున్నాం
☛ మట్టి ఖర్చులు 20 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం
☛ సమ్మె కాలానికి జీతాలు ఇస్తాం 
☛ సమ్మె సమయంలో పెట్టిన కేసులు  ఎత్తేస్తాం
☛ వేతనాల పెంపు పై చర్చల్లో తీసుకున్న నిర్ణయాన్ని మినిట్స్ లో నమోదు చేస్తాం
☛ గ్రాట్యువిటీకి సంబంధించి కేంద్రం నిబంధనలను పాటిస్తాం 
☛ ఉద్యోగ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్ళ కు పెంచాం 
☛ అంగన్వాడీ రోజువారీ కార్యక్రమాల్లో సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నాం 
☛ మా ప్రభుత్వం ఉద్యోగుల పక్షపాతి 
☛ కక్షసాధింపు చర్యలకు పాల్పడే ఆలోచన మా ప్రభుత్వం లేదు 
☛ మినీ సెంటర్లను అప్ గ్రేడ్ చేస్తాం

సుబ్బరావమ్మ, ఏపీ అంగన్వాడీ ప్రధాన కార్యదర్శి మాట‌ల్లో..
 ☛ జీతాలు పెంపు పై నిర్ధిష్ట నిర్ణయంగా జులైలో చేస్తామన్నారు 
☛ మాకు జీతాల పెంపు ఎంత అనేది కూడా రాతపూర్వకంగా ఇస్తామన్నారు
☛ రిటైర్మెంట్ బెనిఫిట్ ను పెంచుతాం అని హామీ ఇచ్చారు
☛ మా డిమాండ్లు నెరవేర్చడానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది
☛ అగన్వాడీలకు వైఎస్ఆర్ భీమా ఇస్తాం అన్నారు
☛ రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచుతాం అని ప్రభుత్వం చెప్పింది
☛ టిఏ బిల్లుల అంశంలో కేంద్రం నుంచీ వచ్చే లోపు రాష్ట్రం ఇవ్వడానికి ఒప్పుకుంది
☛ సీఎఫ్ఎంఎస్ తీసేసి సంక్షేమ పధకాలు అంగన్వాడీలకు వర్తింపుచేస్తాం అన్నారు
► సమ్మె కాలానికి జీతం ఇవ్వడంతో పాటు... కేసులు ఎత్తేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది.

#Tags