Anganwadi Worker Salary Hike Update 2024 : అంగన్‌వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవాల్సిందే.. ఇంకా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : అంగన్‌వాడీ టీచర్లకు నెలకు కనీస వేతనంగా రూ.26 వేలు ఇవ్వాలని అంగన్‌వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షురాలు జొన్నలగడ్డ వెంకటరమణ కోరారు.

నల్లగొండలోని టీఎన్‌జీఓస్‌ భవన్‌లో నిర్వహించిన అసోసియేషన్‌ సర్వసభ్య సమావేశంలో ఆమె మాట్లాడారు. అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు పీఎఫ్‌ సౌకర్యం కల్పించాలన్నారు. సిబ్బందికి హెల్త్‌ కార్డులతో పాటు కమర్షియల్‌ సిలిండర్లను డొమెస్టిక్‌గా మార్చి ఒక్కో సెంటర్‌కు డబుల్‌ సిలిండర్లను ఇవ్వాలన్నారు.

☛ Anganwadi Jobs Notification 2024: అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యుత్‌, మరుగుదొడ్ల వసతి కల్పించాలన్నారు. కూరగాయల బిల్లులు పెంచాలన్నారు. ఈ సమావేశంలో అంగన్‌వాడీల అసోసియేషన్‌ కార్యదర్శి మజ్జిగపు సునీత, కోశాధికారి సునీత, టీన్‌జీఓస్‌ జిల్లా అధ్యక్షుడు ఎం.శ్రవణ్‌కుమార్‌, కార్యదర్శి కిరణ్‌కుమార్‌, కోశాధికారి జయరావు, ఆయా యూనియన్ల మురళి, దుర్గయ్య, శశికళ, అరుణ, సుధ, ఖుర్షిద్‌బేగం, విజయలక్ష్మి, రాజ్యం, కౌసర్‌, వెంకటరావు, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

#Tags