Telangana Govt Jobs 2024: 47% కొలువులు మహిళలకే

సాక్షి, హైదరాబాద్‌: గడిచిన మూడు నెలల్లో మొత్తం 28,942 కొలువులను భర్తీ చేయగా, అందులో 13,571 (47 శాతం) కొలువులను మహిళలు, 15,371 (51 శాతం) ఉద్యోగాలను పురుషులు దక్కించుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

 మహిళా రిజర్వేషన్లను హారిజాంటల్‌గా అమలు చేయాలని ఆదేశిస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జీవో నం.3 జారీ చేయగా, దీనితో మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని బీఆర్‌ఎస్‌ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత మూడు నెలల్లో భర్తీ చేసిన ఉద్యోగాల్లో మహిళలు, పురుషులకు లభించిన పోస్టుల సంఖ్యతో రాష్ట్ర ప్రభుత్వం గణాంకాలను విడుదల చేసింది.

ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం కోటా మాత్రమే ఉన్నా, వారు ఏకంగా 47 శాతం ఉద్యోగాలను దక్కించుకున్నారని ప్రభుత్వం తెలిపింది. రిజర్వేషన్లు, రోస్టర్‌ పాయింట్ల విషయంలో హైకోర్టు, సుప్రీం కోర్టుల ఆదేశాల మేరకు 2022 లోనే రాష్ట్ర ప్రభుత్వం 7593 మెమో జారీ చేసిందని, దాని ఆధారంగానే ప్రభుత్వం ఇటీవల జీవో నం. 3 జారీ చేసిందని అధికారవర్గాలు తెలిపాయి. 

చదవండి: TSPSC Group 1 Guidance: టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌–1 పోస్టులు.. ఎంపిక ప్రక్రియ, సిలబస్‌ విశ్లేషణ, ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

గత మూడు నెలల్లో నియామక పత్రాలు పొందిన ఉద్యోగుల్లో స్త్రీ, పురుషుల సంఖ్యను కింది పట్టికలో చూడవచ్చు..

పోస్టు

పురుషులు

మహిళలు

మొత్తం

పోలీసు కానిస్టేబుల్స్‌/ తత్సమాన పోస్టులు

11,438(81%)

2,661 (19%)

14,099

స్టాఫ్‌ నర్స్‌

823 (12%)

6,133(88%)

6,956

సోషల్‌ వెల్ఫేర్‌ ఉపాధ్యాయులు, జూనియర్‌ లెక్చరర్స్‌

3,059 (39%)

4,741 (61%)

7,800

టీఎస్‌పీఎస్సీ పోస్టులు

51 (59%)

36 (41%)

87

మొత్తం

15,371(53%)

13,571(47%)

28,942

#Tags