Government Jobs: ఒకేసారి ఐదు ప్ర‌భుత్వ ఉద్యోగాలు సాధించిన గ్రామీణ యువతి!

పేద రైతు కూలీ కుటుంబానికి చెందిన పుప్పాల మమత అనే అమ్మాయి ఒకేసారి ఐదు ప్ర‌భుత్వ‌ ఉద్యోగాలను సాధించింది.

తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం ల్యాగలమర్రికి చెందిన ఈమె ఈమె పుప్పాల భూమయ్య, రమ కూతురు. పీజీ, బీఈడీ పూర్తి చేసి, ప్రస్తుతం సిరిసిల్లలోని గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో కాంట్రాక్ట్‌ లెక్చరర్‌గా పనిచేస్తోంది. ఒకే ఒక్క ఉద్యోగం సాధించడానికి ఎంత కష్టపడాలో తెలిసిన ఈ రోజుల్లో, ఐదు ఉద్యోగాలు సాధించడమ‌నేది మామూలు విషయం కాదు. మమత ధైర్యం, పట్టుదల, కృషి ఆమెను ఈ స్థాయికి చేర్చాయి. ఈమె విజయం చాలా మందికి స్ఫూర్తినిస్తుంది.

Success Story : గృహిణిగా బాధ్యతలు మోస్తూనే.. ఒకేసారి రెండు ప్రభుత్వ ఉద్యోగాల‌ను కొట్టానిలా.. 

ఐదు ఉద్యోగాలు ఇవే..
డిగ్రీ లెక్చరర్‌: 2023 ఆగస్టులో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్వహించిన గురుకుల నియామక పరీక్షలో కామర్స్‌ విభాగంలో 16వ ర్యాంకు సాధించి డిగ్రీ లెక్చరర్ ఉద్యోగం పొందింది.
జూనియర్‌ లెక్చరర్‌: జూనియర్‌ లెక్చరర్‌ ఉద్యోగానికి 6వ ర్యాంక్‌ సాధించింది.
పీజీటీ: సోషల్‌ విభాగంలో పీజీటీ ఉద్యోగానికి ఎంపికైంది.
టీజీటీ: సోషల్‌ విభాగంలో టీజీటీ ఉద్యోగం పొందింది.
జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌: టీఎస్‌పీఎస్సీ పరీక్షల్లో రాష్ట్రస్థాయి 23వ ర్యాంకుతో మున్సిపల్‌శాఖలో జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్ ఉద్యోగాన్ని సాధించింది.

Government Jobs : ఒకేసారి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టానిలా. కానీ నా చూపు.. ఈ ఉద్యోగం వైపే..

#Tags