Rakesh Raj Rebba: చిత్రలేఖనంలో డెలివరీ బాయ్ వారెవ్వా.. కుంచె పట్టాడంటే అద్భుతాలు
కుంచె పట్టాడంటే అద్భుతాలు అలా జాలువారుతాయి. చక్కటి రూపాలను మలచడంలో ప్రసిద్ధుడు. కానీ కుటుంబ పరిస్థితులు మాత్రం ఓ డెలివరీ బాయ్ పనికి పరిమితం చేశాయి. అతడి పేరే రాకేశ్ రాజ్ రెబ్బా. పుట్టింది మహారాష్ట్రలోని సోలాపూర్‌లో.. పొట్టకూటి కోసం హైదరాబాద్ వచ్చేసి ఇక్కడే డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు.
చదవండి: Ramchandra Aggarwal Sucess Story: వైకల్యంతో నడవలేని స్థితి, వందల కోట్ల వ్యాపారవేత్తగా విజయం..
చిన్నప్పటి నుంచీ ఆసక్తి..
రాకేశ్‌కు చిత్రలేఖనం అంటే చిన్నప్పటి నుంచే ఆసక్తి.. ఆ కళపై ఎలాగైనా పట్టుసాధించాలనే తపనతో చిన్నప్పుడు.. ఎప్పుడూ చూసినా ఏదో ఒక బొమ్మ గీస్తుండేవాడట. అలా కొన్ని వందల చిత్రాలను పుస్తకాల్లో గీసి అపురూపంగా దాచిపెట్టుకున్నాడు.
మనుషుల ముఖాలను కూడా గీస్తూ ప్రశంసలు పొందుతున్నాడు. ప్రస్తుతం అప్పుడప్పుడూ వాల్ పెయింటిగ్స్ వేస్తూ తన కళను బతికించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తన కళకు మరిన్ని నగిషీలు అద్దితే ఎన్నో ఎత్తులకు చేరుకుంటాడనడంలో అతిశయోక్తి లేదు.
మంచి ఆర్టిస్టు కావాలని కోరిక..
ఆర్ట్ వేయడం అంటే చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టం. సొంతంగానే ఎన్నో బొమ్మలు వేశాను. డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నా. ఎవరైనా ప్రోత్సాహం అందిస్తే మంచి ఆరి్టస్టుగా జీవితంలో పేరు తెచ్చుకోవాలనేది నా కోరిక.
– రాకేశ్ రాజ్ రెబ్బా