Inspiring Woman Success Story : శెభాష్ నిరోశా.. ఒక్కేసారి మూడు ప్ర‌భుత్వ ఉద్యోగాలతో ఔరా అనిపించావ్‌.. కానీ..

మన సంకల్పం బలంగా ఉంటే.. మ‌న లక్ష్య సాధ‌న‌కు సగం చేరువైన‌ట్టే. స‌రిగ్గా ఇలాంటి బ‌ల‌మైన సంక‌ల్పంతో ఉన్న ఒక మ‌హిళ పెళ్ళై పిల్లలు ఉన్నా.. ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా పట్టుబట్టి చదవుపై దృష్టి పెట్టింది.

అలాగే జీవితంలో సాధించాలనే తపన ఉంటే ఏదైనా సాధ్యమేనని నిరూపించింది. ఈమె ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించింది అంద‌రిని ఔరా  అనే చేసింది. ఈమె తెలంగాణ‌లోని కరీంనగర్ జిల్లాకు చెందిన నిరోశా. ఈ నేప‌థ్యంలో మూడు ప్ర‌భుత్వ ఉద్యోగాల‌ను సాధించిన నిరోశా స‌క్సెస్ జ‌ర్నీ మీకోసం..

కుటుంబ నేప‌థ్యం :
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ గ్రామానికి చెందిన దుండే నిరోశాకు ఇంటర్మీడియట్‌లో పెళ్లి జరిగింది. తరువాత కుటుంబ బాధ్యతలు పెరిగాయి. ఇద్దరు పిల్లలు జన్మించారు. రెగ్యులర్‌గా డిగ్రీ చేద్దామంటే కుటుంబ బాధ్యతలు అడ్డు వచ్చాయి. అయితే ఇంటి వద్దనే ఉండి.. ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ పూర్తి చేశారు. ఇందుకు భర్త లక్ష్మణ్ పూర్తిగా సహకరించారు. TPT చేసి మూడుసార్లు తెలంగాణ టెట్ క్వాలిఫై అయ్యారు నిరోశా.

☛ Success Story : గృహిణిగా ఉంటూ.. పిల్లలను చదివిస్తూ.. తాను చదువుకుంటూ.. 3 ప్ర‌భుత్వ‌ ఉద్యోగాలను కొట్టానిలా.. కానీ..

ఓపెన్ కేటగిరిలో..

కేవలం అకడెమిక్ కాకుండా SET, UGC NET అర్హతలు సాధించి తన ప్రతిభను చాటారు. గత సంవత్సరం ఆగస్టులో గురుకుల బోర్డు నిర్వహించిన పరీక్షల ఫలితాల్లో ఏకంగా మూడు ఉద్యోగాలు సాదించి.. శెభాష్ అనిపించుకున్నారు. PGT, TGT టీచర్ ఉద్యోగాలతో పాటు జూనియర్ లెక్చరర్ కొలువులను తన టాలెంట్‌‌తో ఓపెన్ కేటగిరిలో సాధించారు. అటు ఉద్యోగం, పిల్లలు, ఇల్లు చూసుకుంటూ ఎటువంటి కోచింగ్ లేకుండానే ఈ మూడు కొలువులు సాదించారు. సంకల్పం ముందు సమస్యలన్నీ చిన్నవని నిరూపించారు నిరోశా.

☛ Telangana Women Secures Four Government Jobs : ఒకేసారి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టానిలా. కానీ నా చూపు.. ఈ ఉద్యోగం వైపే..

జీవితంలో సాధించాలనే తపన ఉంటే..

ఒక్కేసారి మూడు ఉద్యోగాలు రావడం ఆనందంగా ఉందని అంటున్నారు. కుటుంబ సభ్యుల సహకారంతో.. ఇది సాధ్యమైందని చెబుతున్నారు. పట్టుదల ఉంటే.. ఏదైనా సాధించవచ్చని నిరూపించారు నిరోషా. జీవితంలో సాధించాలనే తపన ఉంటే ఏదైనా సాధ్యమేనని నిరూపించింది. పెళ్ళై పిల్లలు ఉన్నా.. ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా పట్టుబట్టి చదవుపై దృష్టి పెట్టి.. అనుకున్న ల‌క్ష్యం సాధించింది నిరోశా. అలాగే ఈమె సంకల్పం ముందు.. విజ‌యం చిన్న‌దైంది.

☛ Housewife Inspirational Success Story : గృహిణిగా బాధ్యతలు మోస్తూనే.. ఒకేసారి రెండు ప్రభుత్వ ఉద్యోగాల‌ను కొట్టానిలా.. కానీ..

#Tags