Government Job : ఇదే మొదటి ప్ర‌భుత్వ‌ ఉద్యోగం కావడంతో సవాలుగా తీసుకున్నాను.. కానీ

నా పేరు ఉడమల స్వాతి. మాది పార్వతీపురం మన్య జిల్లా సీతానగరం మండలంలోని ఇప్పలవలస. మాది వ్యవసాయ కుటుంబం. వ్యవసారంగం అంటే మక్కువ.

రైతన్నకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో హార్టికల్చర్‌ విభాగంలో డిప్లమో చేశాను. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం భర్తీచేసిన గ్రామ ఉద్యాన సహాకుల నియామకాల్లో గ్రామ ఉద్యానశాఖ సహాయకురాలి(వీహెచ్‌ఏ)గా ఉద్యోగం పొందాను. ఇదే మొదటి ఉద్యోగం కావడంతో సవాలుగా తీసుకున్నాను. 

ఆ రైతులు తమపై చూపే అభిమానం..
రైతన్నకు సేవ చేసేందుకు గొప్ప అవకాశం వచ్చిందనుకున్నా. రామభద్రపురం మండలం కొట్టక్కి ఆర్‌బీకేలో పోస్టింగ్‌ వచ్చింది. అధికారుల సూచనల మేరకు పొలాలకు వెళ్లి రైతన్నకు వ్యవసాయ పరిజ్ఞానాన్ని అందిస్తున్నాను. పుస్తకాల్లో ఉన్న శాస్త్రోక్త పద్ధతులను విడమర్చి చెబుతున్నా. నేను ఇచ్చే సలహాలు పాటించడం వల్ల పంట కలిసివచ్చే సమయంలో ఆ రైతులు తమపై చూపే అభిమానం వెలకట్టలేనిది. వ్యవసాయాన్ని లాభసాటి గా మార్చాలన్న లక్ష్యంతోనే ముందుకు సాగుతున్నా.

#Tags