Inspirational Success Story : కూలీ పనులకు వెళ్తూ.. అన్న, తమ్ముడు, చెల్లి.. అందరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారిలా.. కానీ..!
ప్రభుత్వ కొలువులు సాధించి.. ఒకే కుటుంబానికి చెందిన ఈ ముగ్గురు గ్రామానికే వన్నె తెచ్చారు.
ఏదైనా సాధించాలనే కసితో అహర్నిశలు చదివి.. ప్రభుత్వ ఉద్యోగస్తులుగా స్థిరపడ్డారు తెలంగాణలోని వరంగల్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్ననాగారం గ్రామానికి చెందిన బొమ్మెర యాకలక్ష్మి లచ్చయ్యగౌడ్ సంతానం.
కూలీ పనులకు వెళ్తూ..
లచ్చయ్య కల్లుగీత కార్మికుడిగా వృత్తి నిర్వహిస్తూ.. కూలీ పనులకు వెళ్తూ కూతురు స్వప్న, కుమారులు కేదార్, బాలకృష్ణను చదివించారు. ఆ ముగ్గురు తండ్రి కష్టాన్ని వృథాగా పోనివ్వలేదు. పోటీపడి చదివి కేదార్, స్వప్న 2008 డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్లుగా ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికయ్యారు. ప్రస్తుతం మరిపెడ జెడ్పీహెచ్‌ఎస్‌లో విధులు నిర్వహిస్తున్నారు. బాలకృష్ణ పోలీస్ శాఖలో 2014లో ఎస్సై ఉద్యోగానికి ఎంపికై ప్రస్తుతం ఖమ్మంలో సీఐగా విధులు నిర్వర్తిస్తున్నారు.
#Tags