Government Jobs Ranker Success Story : ఇలా చ‌దివి.. 5 గ‌వ‌ర్న‌మెంట్ జాబ్స్ కొట్టానిలా.. కానీ నేను మాత్రం..!

కష్టపడి చదువుతే.. ఏదైన‌ సాధించవచ్చని నిరూపించారు రాజశేఖర్. ఇప్పుడు రాజశేఖర్‌ను చాలా మంది నిరుద్యోగులు ఆదర్శంగా తీసుకొని పోటీప‌రీక్ష‌ల‌కు ప్రిపేరు అవుతున్నారు.

ప్ర‌స్తుత పోటీ ప్ర‌పంచంలో ఒక్క జాబ్ కొట్టాలంటేనే.. చాలా కష్టం. కానీ.. రాజశేఖర్ మాత్రం ఒక‌టి కాదు.. రెండు కాదు.. ఏకంగా వ‌రుస‌గా 5 ప్ర‌భుత్వ ఉద్యోగాలను సాధించాడు. రాసిన ప్రతి పోటీపరీక్షలో ఉద్యోగం సాధించి ఔరా అనేలా చేశాడు. ఈ నేప‌థ్యంలో రాజశేఖర్ స‌క్సెస్ స్టోరీ మీకోసం..

వ‌చ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు ఇవే..!
క‌రీంనగర్‌ చెందిన రాజశేఖర్.. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే బ‌ల‌మైన‌ పట్టుదలతో ఉండేవాడు. నిత్యం కష్టపడి చదివే వారు. అలాగే తెలంగాణ ప్ర‌భుత్వం ఇటీవ‌ల వ‌రుస‌గా ఉద్యోగ‌ నోటిఫికేష‌న్లు విడుద‌ల చేయ‌డంతో.. రాసిన‌ ప్ర‌తి ప‌రీక్ష‌లో మంచి ప్ర‌తిభ చూపి వ‌రుస‌గా 5 ఉద్యోగాలు సాధించాడు. టీజీటీ, పీజీటీ, జూనియర్ లెక్చరర్, గ్రూప్ 4, తాజాగా ఫలితాలు ప్రకటించిన టీజీపీఎస్సీ జూనియర్ లెక్చరర్ ఇంగ్లీష్ ఉద్యోగాలు సాధించి తన ప్రతిభను చాటారు. ఇప్పటికే గంగాధర బీసీ వెల్ఫేర్ స్కూల్‌లో ఇంగ్లీష్ టీచర్‌గా పనిచేస్తున్నారు. ప్రతి పరీక్షను సవాలుగా తీసుకొని చదివారు. దీంతో.. సబ్జెక్టు పై పట్టు సాధించి.. విజ‌యం కొట్టారు.

నా ల‌క్ష్యం ఇదే..
ఐదు ఉద్యోగాలు సాధించడంతో స్నేహితులతో పాటు కుటుంబ స‌భ్యులు అభినందిస్తున్నారు. భవిష్యత్‌లో ఉన్నత ఉద్యోగం సాధించాల‌న్న‌దే నా క‌ల అంటున్నాడు. నేను ఈ జాబుతోనే సరిపెట్టుకోనని రానున్న రోజుల్లో సివిల్స్ ప్రిపేర్ అయి.. ఐఏఎస్ కావడమే తన లక్ష్యం అంటున్నాడు. 

సక్సెస్ అనేది...
పట్టుదలతో చ‌దివితే.. ఎంతటి ఉద్యోగం అయిన సాధించవచ్చ‌న్నారు. పోటీప‌రీక్ష‌ల‌కు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులు... నేను చెప్పేది ఏంటంటే సక్సెస్ అనేది ఊరికే రాదు దానికి తగ్గట్టు కష్టం కూడా ఉండాలి అప్పుడే మనం విజ‌యం సాధిస్తామన్నారు. నేడు ఎంతో మంది యువతకు రాజశేఖర్ ఆదర్శంగా నిలిచాడు.

#Tags