TS Gurukulam TGT Selection List: తెలంగాణ సంక్షేమ గురుకులాల్లో టీజీటీ ఫలితాలు విడుదల,సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ ఎప్పుడంటే..

తెలంగాణ సంక్షేమ గురుకులాల్లో టీజీటీ పోస్టుల ఫలితాలు(TREIRB TGT 2024 Results) విడుదల అయ్యాయి. గురుకులాల్లో 4,006 ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (TGT) పోస్టులకు గత ఆగస్టులో రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఈ పరీక్షల్లో మెరిట్ సాధించిన అభ్యర్థులను 1:2 నిష్పత్తిలో ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు ఎంపిక చేశారు.ఈ మేరకు ప్రొవిజినల్ సెలెక్షన్ జాబితాను విడుదల చేసింది.ఎంపికైన అభ్యర్థులకు ఫిబ్రవరి 27, 28 తేదీల్లో ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఉంటుంది.

హైదరాబాద్‌లోని బంజారాభవన్‌, శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో సర్టిఫికేట్ల పరిశీలన ఉంటుంది. అనంతరం రెండు రోజుల్లో ఫైనల్ లిస్ట్ విడుదల చేస్తారు. 


సంక్షేమ గురుకులాల్లో జూనియర్‌, డిగ్రీ లెక్చరర్‌ పోస్టుల ఫలితాలు
సంక్షేమ గురుకులాల్లో 2,717 జూనియర్‌, డిగ్రీ లెక్చరర్‌ పోస్టులకు నిర్వహించిన రాతపరీక్షల తుది జాబితాను నియామక బోర్డు ప్రకటించింది.

రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల జూనియర్‌ కళాశాలల్లో 1,924 పోస్టులు, డిగ్రీ కాలేజీల్లో 793 లెక్చరర్ పోస్టులకు గతేడాది ఆగస్టులో రాతపరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. అందులో మెరిట్‌ ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్‌ జాబితాను ఈ నెల రెండో వారంలో విడుదల చేసింది.

మెరిట్ జాబితా ఆధారంగా ఈ నెల 19, 20 తేదీల్లో సర్టిఫికెట్ల పరిశీలన, డెమో తరగతులు నిర్వహించింది. వీటిలో అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా గురుకుల నియామక బోర్డు తుది ఫలితాలను వెల్లడించనుంది. దీంతో పాటు దివ్యాంగుల కేటగిరీకి చెందిన తుది ఫలితాలు మరో రెండు రోజుల్లో ప్రకటించనున్నారు.
 

#Tags