ల్యాబ్ టెక్నీషియన్ల జీతం పెంపు

జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్ హెచ్‌ఎం) పరిధిలో పనిచేస్తున్న ల్యాబ్‌ టెక్నీషియన్లందరికీ ప్రస్తుతం పొందుతున్న రూ.17 వేల వేతనాన్ని సవరించి రూ.21 వేలకు పెంచుతూ వైద్య, ఆరోగ్యశాఖ ఫిబ్రవరి 2న ఉత్తర్వులు జారీచేసింది.
ల్యాబ్ టెక్నీషియన్ల జీతం పెంపు

30 శాతం పీఆర్సీతో కలుపుకుని వీరంతా రూ.27,300 గౌరవ వేతనం పొందనున్నారు. తెలంగాణ‌ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు సహకారంతో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంచాల రవీందర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈమేరకు హరీశ్‌రావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కరోనా కాలంలో ల్యాబ్‌ టెక్నీషియన్లు చేసిన కృషి అమోఘమని హరీశ్‌రావు కొనియాడారు.

చదవండి: 

39000 Jobs: వైద్య ఆరోగ్య శాఖలో 39 వేల ఉద్యోగాలు

Tenth Exams: ఏప్రిల్ చివర లేదా మేలో

#Tags