Teachers Transfer, Promotions Schedule: బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ విడుదల

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులు కల్పించేంందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇందుకు సంబంధించిన ప్రక్రియ జూన్ 9‌ నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో శని, ఆదివారాల్లో జిల్లా విద్యాశాఖ కార్యాలయాల్లో సీనియార్టీ జాబితాలను ప్రదర్శించనున్నారు. జూన్‌ 10, 11వ తేదీల్లో సీనియార్టీ జాబితాలపై అభ్యంతరాలు చెప్పుకునే అవకాశం ఉంది.

చదవండి: Child Choice in Education: కాలేజీ సమయం.. చదువు ఎంపికలో పిల్లల మాట కూడా వినండయ్యా..

అనంతరం చివరి జాబితాలను 12వ తేదీన అధికారులు ప్రదర్శించనున్నారు. 13 నుంచి 16 వరకు వెబ్‌ ఆప్షన్లు పెట్టుకునేందుకు అవకాశంతో పాటు ఇదే తేదీల్లో ఎస్జీటీలు, స్కూల్‌ అసిస్టెంట్‌లకు ప్రమోషన్లు కల్పించనున్నారు.

ఈ ప్రక్రియ ఈనెల చివరి వరకు కొనసాగనుంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 14,200 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తుండగా ఇందులో 9 వేలకు పైగా గతంలో బదిలీలు, పదోన్నతుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో ఈసారి దరఖాస్తులు పెరిగే అవకాశం ఉంది.

#Tags