Gurukulam Jobs Selection List: గురుకుల కొలువుల అభ్యర్థుల జాబితా విడుదల

సాక్షి, హైదరాబాద్‌: గురుకుల విద్యా సంస్థల్లో వివిధ కేటగిరీల్లో ఉద్యోగాలకు అర్హత సాధించిన దివ్యాంగ(పీడబ్ల్యూడీ) అభ్యర్థుల జాబితాను తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు(టీఆర్‌ఈఐఆర్‌బీ) జూన్ 24న‌ సాయంత్రం విడుదల చేయనుంది.

ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల మెడికల్‌ సర్టిఫికెట్ల పరిశీలనకు సంబంధించి సరోజినీదేవి కంటి ఆస్పత్రి, కోఠిలోని ఈఎన్‌టీ ఆస్పత్రుల నుంచి నిర్ధారణ వచ్చినట్లు టీఆర్‌ఈఐఆర్‌బీ చైర్‌పర్సన్‌ ఆయేషా మస్రత్‌ ఖానమ్‌ జూన్ 23న‌ ఓ ప్రకటనలో తెలిపారు.

చదవండి: TSPSC Groups Preparation Tips: ఉమ్మడి ప్రిపరేషన్‌.. గ్రూప్స్‌ గెలుపు!

అర్హత సాధించిన దివ్యాంగ అభ్యర్థుల జాబితాను జూన్ 24న‌ ప్రకటిస్తామని, నిర్దేశించిన సొసైటీలు ఈ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన తదుపరి చర్యలు తీసుకుంటుందని వివరించారు. 
 

#Tags