TGSWREIS: గురుకులాల్లో సాధారణ బదిలీలు నిర్వహించాలి

సాక్షి, హైదరాబాద్‌: గురుకుల విద్యా సంస్థల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి సా ధారణ బదిలీలు చేపట్టాలని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయ, ఉద్యో గుల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.

ఈమేరకు జూన్ 10న‌ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఉపా ధ్యాయ, ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్‌ బాలరాజు, ఎన్‌.దయాకర్‌ తదితరులు వినతిపత్రాన్ని అందించారు.

చదవండి: Gurukula Staff Issues: గురుకుల సిబ్బంది సమస్యలపై వినతి

ఎస్సీ, ఎస్టీ గురుకుల పాఠశాలల్లో ఆరేళ్లుగా బదిలీలు చేపట్టలేదని, 2018లో జరిగిన మెజార్టీ ఉద్యోగులకు గరిష్ట పరిమితి సర్వీసు పూర్తి చేసుకోకపోవడంతో స్థానచలనం కలగలేద ని తెలిపారు. కొత్తగా ఉద్యోగుల నియామకాలు చేపడుతున్న నేపథ్యంలో ఆలోపే బదిలీలు, పదోన్నతులు నిర్వహించాలని కోరారు.   

#Tags