అసోసియేట్‌లుగా 246 మంది ప్రమోషన్‌

సాక్షి, అమరావతి: డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌(డీఎంఈ) పరిధిలో 32 స్పెషాలిటీలు, సూపర్‌ స్పెషాలిటీల్లో 246 మంది వైద్యులకు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నుంచి అసోసియేట్‌ ప్రొఫెసర్లుగా ప్రభుత్వం ప్రమోషన్‌ కల్పించింది.
అసోసియేట్‌లుగా 246 మంది ప్రమోషన్‌

వీరికి పోస్టింగ్‌లు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశామని డీఎంఈ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ తెలిపారు. ఉద్యోగోన్నతి కల్పించడం ద్వారా ఖాళీ అయిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను భర్తీ చేయడానికి ఇప్పటికే నోటిఫికేషన్‌ జారీ చేసి, తుది మెరిట్‌ జాబితా కూడా సిద్ధం చేశామని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ముగిసిన వెంటనే అభ్యర్థులను ఎంపిక చేసి, 246 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు.

చదవండి: Inspirational Story: 11 ఏళ్ల వ‌ర‌కు మాట‌లే రావు.. 18 ఏళ్ల వ‌ర‌కు చ‌ద‌వ‌డం, రాయ‌డం రాదు... కానీ, తాన‌నుకున్న ప్రొఫెస‌ర్ అయ్యాడిలా

వైద్య విద్యకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఈ క్రమంలో బోధనాస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండకుండా ఎన్‌ఎంసీ నిబంధనలకు అనుగుణంగా పోస్టులను భర్తీ చేస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ముగిశాక ఎస్‌ఆర్‌ పోస్టులకు కూడా నోటిఫికేషన్‌ జారీ చేస్తామని వివరించారు.

చదవండి: 295 Jobs: మెడికల్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు

#Tags