Job Mela: వీఎస్‌యూలో 11న జాబ్ మేళా.. కావల్సిన అర్హతలివే!
వెంకటాచలం: కాకుటూరు సమీపంలోని విక్రమ సింహపురి యూనివర్సిటీ (వీఎస్‌యూ)లో జాబ్‌మేళాను ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, జిల్లా ఎంప్లాయ్‌మెంట్ కార్యాలయం, సీడాప్ ఆధ్వర్యంలో నవంబర్ 11న నిర్వహించనున్నామని ఇన్‌చార్జి వీసీ విజయభాస్కర్‌రావు నవంబర్ 8న ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారని, 18 నుంచి 35 ఏళ్లలోపు ఉండి ఇంటర్ నుంచి పీజీ చదివిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు 79896 13024, 95734 82179 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
చదవండి: AP Govt Job Notification 2024: ఏపీ 'నిట్'లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. మొత్తం ఎన్ని పోస్టులంటే
123 మంది విద్యార్థుల గైర్హాజరు
వెంకటాచలం: వీఎస్‌యూ పరిధిలోని అనుబంధ కళాశాలల్లో నవంబర్ 8న నిర్వహించిన మూడో సెమిస్టర్ పరీక్షలకు 123 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని వర్సిటీ పరీక్షల నిర్వహణాధికారి డాక్టర్ మధుమతి తెలిపారు. 1385 మంది విద్యార్థులకు గానూ 1262 మంది హాజరయ్యారని చెప్పారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |