Faculty Jobs: అతిథి అధ్యాపకులకు దరఖాస్తుల ఆహ్వానం.. అర్హుతలు ఇవే..
భైంసా టౌన్: ముధోల్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు భైంసా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ బుచ్చయ్య తెలిపారు.
ఇంగ్లిష్, తెలుగు, అర్థశాస్త్‌త్రం, కామర్స్, జువాలజీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులు బోధించేందుకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
సంబంధిత సబ్జెక్టులో 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణత సాధించినవారు అర్హులని పేర్కొన్నారు. సెప్టెంబర్ 24లోగా భైంసాలోని డిగ్రీ కళాశాలలో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. 25న ఉదయం 10 గంటల నుంచి ఇంటర్వ్యూ నిర్వహిస్తామని వెల్లడించారు.
చదవండి: Specialist Cadre Posts : ఎస్‌బీఐలో రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు..
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
నెట్, సెట్, పీహెచ్‌డీ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. 22న ఆదివారం సైతం కళాశాలలో దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. వివరాలకు 99633 08287 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
#Tags