Free Coaching: గ్రూప్స్‌, పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ కోసం దరఖాస్తుల ఆహ్వానం

నిజామాబాద్‌ అర్బన్‌: ఎస్సీ స్టడీ సెంటర్‌లో గ్రూప్స్‌, పోటీ పరీక్షలకు సంబంధించిన ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సాంఘికసంక్షేమ శాఖ అధికారిణి శశికళ ఫిబ్ర‌వ‌రి 26న‌ ఒక ప్రకటనలో కోరారు.

 ఉమ్మడి జిల్లాకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులకు నిజామాబాద్‌ నగరంలోని నాందేవ్‌వాడలో ఐదు నెలలపాటు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలతోపాటు ఆర్‌ఆర్‌బీ, బ్యాంకింగ్‌, ఎస్‌ఎస్‌సీ అర్హుత పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

మార్చి 6వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలని, 10న ప్రవేశ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. ప్రవేశపరీక్ష మార్కుల ఆధారంగా 100 మంది అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు ప్రకటనలో తెలిపారు.

#Tags