Group 4 Exam Dates: గ్రూప్‌– 4 పరీక్ష తేదీ ఇదే.. 6,244 పోస్టుల భర్తీ

సాక్షి, చైన్నె : గ్రూప్‌– 4 పరీక్ష తేదీని తమిళనాడు పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ జ‌నవ‌రి 30న‌ ప్రకటించింది.

 జూన్‌ 9వ తేదీ జరిగే ఈ పరీక్ష ద్వారా 6,244 పోస్టుల భర్తీ చేయనున్నారు. వివరాలు.. రాష్ట్ర ప్రభుత్వంలోని పలు విభాగాలలో ఖాళీలను గుర్తించి పరీక్షల ద్వారా టీఎన్‌పీఎస్సీ ఎప్పటికప్పుడు భర్తీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ ఏడాది టీఎన్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ జారీలో కొంత జాప్యం నెలకొంది.

కమిషన్‌కు పూర్తి స్థాయిలో ఛైర్మన్‌ నియామకం జరగకపోడమే ఇందుకు కారణం. ఈ వ్యవహారానికి సంబంధించిన దస్త్రం రాజ్‌ భవన్‌లో పెండింగ్‌లో ఉంది. ఈ పరిస్థితులలో ఖాళీలను గుర్తించిన టీఎన్‌పీఎస్సీ అధికారులు పరీక్షల నిర్వహణకు సిద్ధమయ్యారు. వీఏవో –108, జూనియర్‌ అసిస్టెంట్స్‌(నాన్‌ సెక్యూరిటీ) 2442, జూనియర్‌ అసిస్టెంట్స్‌(సెక్యూరిటీ) 44, జూనియర్‌ అసిస్టెంట్‌, టైపిస్టు, పర్సనల్‌ అసిస్టెంట్స్‌, పర్సనల్‌ క్లర్క్‌, ప్రైవేటు సెక్యూరిటీ (గేడ్‌ 3), జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌, రికార్డర్‌, ల్యాబరొటరి అసిస్టెంట్స్‌, బిల్‌ కలెక్టర్‌, సీనియర్‌ ఫ్యాక్టరీ అసిస్టెంట్స్‌, ఫారెస్ట్‌ గార్డ్‌, డ్రైవర్‌ తదితర 32 కేటగిరిలలో మొత్తంగా 6,244 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నారు. ఈ పోస్టులకు అర్హులైన వారికి కనీస విద్యార్హతగా 12వ తరగతిగా పేర్కొన్నారు.

చదవండి: Latest Central Govt Jobs 2024: టెన్త్, ఇంటర్‌తోనే కేంద్ర కొలువు.. రాత పరీక్ష ఇలా..

18 నుంచి 32 ఏళ్లలోపు వారు దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పించారు. దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా టీఎన్‌పీఎస్సీ వెబ్‌ సైట్‌లో మార్చి 6వ తేదీలోపు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని ప్రకటించారు. పరీక్ష జూన్‌ 9వ తేదీన ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు టీఎన్‌పీఎస్సీ నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తామని తెలిపారు.

#Tags