Free Training: యువతకు ఉచిత శిక్షణ

ఆసిఫాబాద్‌ అర్బన్‌: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని గిరిజన నిరుద్యోగ యువతీ యువకులకు డాక్టర్‌ రెడ్డి ల్యాబ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా ఆగ‌స్టు 4న‌ ఒక ప్రకటనలో తెలిపారు.

హైదరాబాద్‌, కరీంనగర్‌లోని శిక్షణ కేంద్రంలో 3 నెలల పాటు వివిధ కోర్సుల్లో శిక్షణ అందించి ఉపాధి కల్పించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఎలక్ట్రికల్‌, మెకానిక్‌లో ఐఐటీ, డిప్లొ మా అర్హత కలిగిన 18 నుంచి 28 సంవత్సరాల వయస్సు కలిగిన వారికి సోలార్‌ ప్యానల్‌ ఇన్‌స్టాలేషన్‌ టెక్నీషియన్‌, ఎలక్ట్రికల్‌ వెహికిల్‌ మెయింటనెన్స్‌ టెక్నీషియన్‌ కోర్సుల్లో 3 నెలలు, కంప్యూటర్‌ సైన్స్‌లో బీసీఏ, బీఎస్సీ అర్హత కలిగిన వారికి పుల్‌ స్టాక్‌ డెవలపర్‌ కోర్సుల్లో 3 నెలల ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.

చదవండి: Spoken English Training: స్పోకెన్‌ ఇంగ్లిష్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌పై శిక్షణ

ఆసక్తి, అర్హత కలిగిన వారు ధ్రువీకరణ పత్రాలతో ఈ నెల 5 నుంచి 10వ తేదీలోగా ఉట్నూర్‌లోని ఐటీడీఏ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9010295910, 9666748105, 94935 35052 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

#Tags