Skip to main content

DSC Free Coaching : డీఎస్సీ అభ్య‌ర్థుల‌కు ఉచిత కోచింగ్.. ఈ ప‌త్రాలు త‌ప్ప‌నిస‌రి..

Free coaching for AP DSC candidates for teacher posts  Government of Andhra Pradesh free DSC coaching for tribal youth  District Tribal Welfare and Empowerment Officer P. Tejaswini announcement 33 percent reservation for women in DSC coaching program

రాయచోటి: బీఈడీ/డీఈడీ కోర్సులు పూర్తి చేసి టెట్‌లో ఉత్తీర్ణత పొందిన గిరిజన కులానికి చెందిన నిరుద్యోగ యువతీ యువకులకు డీఎస్సీలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉచిత కోచింగ్‌ ఇవ్వనుంది. ఈ విషయాన్ని జిల్లా గిరిజన సంక్షేమ, సాధికారిత అధికారిణి పి.తేజస్విని ఒక ప్రకటనలో తెలిపారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కలదన్నారు.

National Scholarship: నేషనల్‌ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ ఇదే

గిరిజన నిరుద్యోగ యువతీ యువకులు వారి పూర్తి బయోడేటాతో పాటు విద్యార్హత, కులధృవీకరణపత్రం, రేషన్‌, ఆధార్‌కార్డు, పాస్‌పోర్టు సైజు కలర్‌ ఫొటో, బీఈడీ/డీఈడీ, టెట్‌ కోర్సులకు సంబంధించి ధృవీకరణ పత్రం నకలును గెజిటెడ్‌ అధికారితో ధృవీకరించి రాయచోటిలోని జిల్లా గిరిజన సంక్షేమ, సాధికారిత అధికారి కార్యాలయం, మైనార్టీ బాలికల వసతిగృహం, కలెక్టరేట్‌ ప్రాంగణంలో ఈ నెల 12వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాలన్నారు. వివరాలకు 8332082016 నంబర్‌లో సంప్రదించాలని ఆమె తెలిపారు.

Nikita Ketawat: హెడ్‌కానిస్టేబుల్‌ కుమార్తెకు ఆరు ఉద్యోగాలు

Published date : 06 Aug 2024 01:47PM

Photo Stories