Medical Jobs: త్వరలో వైద్య పోస్టుల భర్తీ.. మెత్తం ఖాళీలు ఇలా

హత్నూర(సంగారెడ్డి): ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఖాళీగా ఉన్న డాక్టర్లు, సిబ్బందిని త్వరలోనే భర్తీ చేస్తామని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి గాయత్రీ దేవి అన్నారు.

అక్టోబర్ 24న హత్నూర మండలం దౌల్తాబాద్‌లో ఆమె సాక్షితో మాట్లాడారు. జిల్లాలో 30 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండగా.. అందులో 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 24 గంటలు పనిచేస్తున్నాయని, 13 కేంద్రాలు 12 గంటలు పనిచేస్తున్నాయని తెలిపారు. వీటిలో 56 మందికి గాను ప్రస్తుతం 46 మంది మాత్రమే డాక్టర్లు పనిచేస్తున్నారని తెలిపారు. 10 డాక్టర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.

చదవండి: School Inspection : పాఠ‌శాల‌ల్లో వైద్య ఆరోగ్య‌శాఖాధికారి త‌న‌ఖీలు

జిల్లాలో 246 సబ్‌ సెంటర్లు ఉండగా.. అందులో ఇద్దరు ఏఎన్‌ఎంలు పనిచేయాల్సి ఉండగా.. ఒకరు మాత్రమే ఉన్నారని, త్వరలోనే ఇంకొకరిని కూడా నియమించేందుకు ప్రతిపాదనలు పంపినట్లు వివరించారు. 150 మంది స్టాఫ్‌ నర్సులు అవసరం ఉండగా వంద మంది మాత్రమే పనిచేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వానికి నివేదిక పంపామని, త్వరలో వాటిని భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు

త్వరలోనే హత్నూర, రామచంద్రాపురం, సంగారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను ప్రారంభిస్తామని డీఎంహెచ్‌ఓ చెప్పారు. ప్రస్తుతం కొండాపూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ ఆపరేషన్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

జిల్లాలో ఆర్‌ఎంపీ, పీఎంపీలు 941 ఉన్నారన్నారు. వీరికి ఎలాంటి అనుమతులు లేవని ఇంజక్షన్లు, గ్లూకోస్లు కానీ రోగులకు పెట్టవద్దని ఆమె సూచించారు. జిల్లాలో ఇప్పటికీ 17 అనుమతి లేని ఆసుపత్రులను సీజ్‌ చేశామని, 172 ఆసుపత్రులకు నోటీసులు జారీ చేశామని ఆమె తెలిపారు. ఇటీవల రామచంద్రపురంలో ఒక ఆసుపత్రిని సీజ్‌ చేసి కేసు చేశామన్నారు. ఆర్‌ఎంపీలు కేవలం ప్రాథమిక చికిత్స చేసి ఇతర ఆసుపత్రులకు పంపించాలని సూచించారు.
 

#Tags