Employees Should be Regularized: ‘సమగ్ర శిక్షా ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి’

సాక్షి, హైదరాబాద్‌: చాలీచాలని జీతాలతో పని చేస్తున్న సమగ్ర శిక్షా ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలని, కనీస టైం స్కేలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి దుండిగల్‌ యాదగిరి జూన్ 19న‌ డిమాండ్‌ చేశారు.

19 వేల మందికి పైగా ఉన్న సమగ్ర శిక్ష ఉద్యోగులు రూ.10 వేల నుంచి రూ.30 వేల జీతానికి పని చేస్తున్నారని, వారికి ఉద్యోగ భద్రత సైతం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించకపోతే ఆందోళన తప్ప.. మరో మార్గం లేదని యాదగిరి స్పష్టం చేశారు.   

చదవండి:

Samagra Shiksha: బంగారు ‘భవిత’.. సమగ్రశిక్ష ద్వారా సంక్షేమ పథకాల వర్తింపు

SSA Staff: విద్యాశాఖలో విలీనం చేయాలి

#Tags