Singareni (SCCL): జూనియర్‌ అసిస్టెంట్‌ అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు

సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థలో జూనియర్‌ అసిస్టెంట్‌ (గ్రేడ్‌–2)లుగా ఎంపికై న వారికి జీఎం పర్సనల్‌ (వెల్ఫేర్‌ అండ్‌ ఆర్సీ) కట్టా బసవయ్య కొత్తగూడెంలో అక్టోబ‌ర్ 6న‌ ప్రొవిజినల్‌ నియామక ఉత్తర్వులు అందజేశారు.
జూనియర్‌ అసిస్టెంట్‌ అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 177 పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల్లో అర్హత సాధించిన 135 మందికి ప్రొవిజినల్‌ నియామక పత్రాలు ఇచ్చామని, మిగిలిన వారికి కూడా ఎన్‌ఓసీ వస్తే పత్రాలు జారీ చేస్తామని చెప్పారు. సింగరేణి ఆస్పత్రిలో పరీక్షల అనంతరం ఖాళీల ఆధారంగా పోస్టింగ్‌ ఇస్తామని తెలిపారు.

చదవండి: Singareni Seva Samiti: నిరుద్యోగ యువతకు సింగరేణి ప్రోత్సాహం

కార్యక్రమంలో అధికారులు కోడూరి శ్రీనివాసరావు, వేణుగోపాల్‌రావు, ముకుంద సత్యనారాయణ, నాగేశ్వరరావు, కె.సంతోష్‌కుమార్‌, బి.సుశీల్‌కుమార్‌, కె.శివకుమార్‌, వరప్రసాద్‌, వెంకటరమణ, ప్రభాకర్‌ పాల్గొన్నారు.

#Tags