Jobs: పలు పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ
కైలాస్‌నగర్: జిల్లాలోని ఆయా కేజీబీవీలలో నాన్‌టీచింగ్ పోస్టులైన ఆఫీస్ సబార్డి నేట్, డేనైట్ వాచ్ ఉమెన్, హెడ్‌కుక్, అసిస్టెంట్ కుక్, స్కావెంజర్ పోస్టుల భర్తీకి గా ను దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు డీఈవో ప్రణీత ప్రకటనలో తెలిపారు.
ఆదిలాబాద్ అర్బన్, బజార్‌హత్నూర్, బేల, బోథ్, ఇచ్చోడ, గుడిహత్నూర్, ఇంద్రవెల్లి, తలమడుగు కేజీబీవీలలో ఒకటి చొప్పున నైట్ వాచ్ ఉమన్, జైనథ్ కేజీబీవీలో డే వాచ్‌ఉమన్, నేరడిగొండ కేజీబీవీలో అసిస్టెంట్ కుక్ రెండు, కేజీబీవీ బోథ్‌లో ఒక అటెండర్, కేజీబీవీ తాంసిలో ఒక స్కావెంజర్ పోస్టులు ఖాళీలు ఉన్నట్లుగా పేర్కొన్నారు.
ఆసక్తి, అర్హులైన మహిళా అభ్యర్థినులు ఆగ స్టు 1వరకు సంబంధిత మండల విద్యాధికారి కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పోస్టులకు ఎంపికై న వారికి రూ.9,750 ప్రోత్సహాకం అందించనున్నట్లు పేర్కొన్నారు.
#Tags