Teacher posts in Gurukuls: గురుకులాల్లో టీచర్ పోస్టుల భర్తీకి 15న వాక్‌ఇన్
అనంతపురం : ఉమ్మడి జిల్లాలోని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ (అంబేడ్కర్) గురుకులాల్లో ఖాళీగా ఉండే ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు గురుకులాల సమన్వయ అధికారి అంగడి మురళీకృష్ణ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. డెమో ద్వారా తాత్కాలిక ప్రాతిపదికన గెస్ట్/పార్ట్‌టైమ్ టీచర్స్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ఆసక్తిగల వారు ఈనెల 15న కురుగుంట అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో జరిగే డెమో/వాక్‌ఇన్‌కు ఒరిజినల్ విద్యార్హత సర్టిఫికెట్ల (డిగ్రీ, పీజీ, టెట్, బీపీఈడీ)తో ఉదయం 10 గంటలకు హాజరుకావాలని సూచించారు. బాలికల పాఠశాలలకు మహిళలను, బాలుర పాఠశాలలకు పురుషులతో మాత్రమే భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు.
Also Read : Download TSPSC Group-1 Preliminary Key
#Tags