Government School: ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న పాఠ‌శాల‌.. ఇక్క‌డ చ‌దివిన విద్యార్థులు సాధించిన‌ విజయాలు ఇవే.!

నల్లగొండ జిల్లా, నకిరేకల్ మండలం, చందుపట్ల గ్రామంలో ఉన్న జెడ్పీ హైస్కూల్ ఒక ఘన చరిత్ర కలిగిన విద్యాసంస్థ.

1956లో స్థాపించబడిన ఈ పాఠశాల 60 ఏళ్లుగా నాణ్యమైన విద్యను అందిస్తూ వస్తోంది.

ఈ పాఠశాల ప్రత్యేకతలు.. 
➢ నల్లగొండ జిల్లాలో తొలి తాలుకా పాఠశాల.
➢ గ్రామస్తుల శ్రమదానంతో నిర్మించబడింది.
➢ ౩౦ గ్రామాల్లోని పిల్లలకు నందించిన ఘనత ఈ పాటశాల సొంతం.
➢ ఎంతో మంది ప్రముఖులకు విద్యాదానం చేసింది.

ఇక్క‌డ చ‌దివిన వారు సాధించిన‌ విజయాలు ఇవే..
ఈ పాఠశాలలో చదువుకున్న అనేక మంది ఉపాధ్యాయులు, డాక్టర్లు, పోలీసులు, వ్యాపారవేత్తలు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, రాజకీయ నాయకులు అయ్యారు. ఇలా ఈ పాఠశాలలో చదువుకొని ఉన్నత శిఖరాలను అందుకున్న వారు ఎందరో ఉన్నారు.

చందుపట్ల జెడ్పీ హైస్కూల్ గ్రామీణ ప్రాంతంలో ఉన్నప్పటికీ, నాణ్యమైన విద్యను అందించడంలో ఎన్నో ప్రముఖ పాఠశాలలకు పోటీగా నిలుస్తోంది. ఆ రోజుల్లోనే గ్రామస్తులంతా శ్రమదానం చేసి పాటశాలను నిర్మించుకున్నారు. పాటశాలకు కావాల్సిసిన భూమిని గ్రామ పెద్దలు విరాళంగా ఇచ్చారు. ఇంకా ఈ పాఠశాల అభివృద్ధికి గ్రామస్తులు, పాత విద్యార్థులు, ప్రభుత్వం కృషి చేయాలని మ‌న‌సారా కోరుకుందాం.

Nadu Nedu Scheme: 'నాడు–నేడు'తో మారిన పాఠశాలల రూపురేఖలు!!

#Tags