School Students: బడులు తెరిచే నాటికే విద్యార్థుల పాఠ్య‌పుస్త‌కాలు, యూనిఫార్మ్..

పాఠ‌శాల‌లు పునఃప్రారంభం అయ్యేనాటికి పాఠ్య‌పుస్త‌కాలు, యూనిఫార్మ్ వంటివి విద్యార్థుల చేతికి అందేలా చర్యలు వేగవంతం అయ్యాయి..

మంచిర్యాల: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అందించే ఉచిత పాఠ్యపుస్తకాలు జిల్లా బుక్‌డిపోకు చేరాయి. వేసవి సెలవుల్లోనే గుడిపేట్‌లోని బుక్‌డిపోకు పాఠ్యపుస్తకాలు సరఫరా అవుతుండగా.. బడులు తెరిచే నాటికి విద్యార్థులకు చేతికి అందేలా చర్యలు వేగవంతం అయ్యాయి. నాలుగు రోజులుగా గూడ్స్‌ వాహనాల ద్వారా ఇప్పటికే 89,920 పాఠ్య పుస్తకాలు చేరినట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఉచిత యూనిఫామ్‌తోపాటు పాఠ్యపుస్తకాలు సకాలంలో అందించాలని ముందుస్తు చర్యలు చేపట్టారు.

TSEAP set 2024: టీఎస్ఈఏపీ సెట్ ప్ర‌వేశ ప‌రీక్ష‌ ప్రారంభం.. పేప‌ర్లు ఇలా వ‌చ్చాయి..!

యూనిఫామ్‌లకు అవసరమైన విద్యార్థుల నుంచి కొలతలు పూర్తి చేసి దుస్తులు కుట్టడంలో సెల్ఫ్‌హెల్ప్‌గ్రూపు సభ్యులు నిమగ్నమయ్యారు. ఈ విద్యాసంవత్సరం బడులు తెరిచే నాటికి పాఠ్య పుస్తకాలు అందించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు 4,15,494 అవసరమైన ఉచిత పాఠ్యపుస్తకాలు అందిచాల్సి ఉంది. ఇందులో గ్రౌండ్‌ బ్యాలెన్స్‌ 15,874 పోను 3,99,620 పుస్తకాలు జిల్లాకు రావాల్సి ఉంది. ఇందులో ఇప్పటివరకు 89,920 పాఠ్య పుస్తకాలు బుక్‌డిపోకు చేరాయి. పాఠశాల స్థాయి విద్యార్థులకు పాఠ్య పుస్తకాల సరఫరాకు టెండర్ల ఖరారులో కూడా జాప్యం కాకుండా చర్యలు చేపట్టనున్నారు.

ADCET 2024: ఆర్ట్‌ అండ్‌ డిజైన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఏడీసెట్‌) నోటిఫికేషన్‌ విడుదల

పుస్తక విక్రయ కేంద్రం నుంచి పాఠ్య పుస్తకాలను మండల పాయింట్లకు సరఫరా చేసేందుకు ముందుస్తుగా టెండరు ప్రక్రియ నిర్వహించనున్నారు. మండల పాయింట్ల నుంచి పాఠశాలకు చేరేలా సన్నద్ధం అవుతున్నారు. పాఠ్యపుస్తకాలు పూర్తిస్థాయిలో బుక్‌డిపోకు చేరగానే అక్కడి నుంచి మండల పాయింట్లకు పంపిణీ చేసేలా చర్యలు చేపట్టినట్లు డీఈవో యాదయ్య తెలిపారు.

Sunita Williams: రోదసీ యాత్ర‌కు సిద్ధ‌మైన‌ సునీతా విలియమ్స్.. ఆగిన యాత్రకు కొత్త తేదీ ఖరారు..

#Tags