Telangana Public Schools: తెలంగాణలో పబ్లిక్‌ స్కూల్స్‌ ఏర్పాట్లు..!!

ఈ పాఠశాలల కోసం గతనెల నిర్వహించిన బడ్జెట్‌ సమావేశంలో పైలెట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించనున్న తెలంగాణ పబ్లిక్‌ స్కూల్స్‌ కోసం రూ. 500 కోట్లను కేటాయించారు.. పూర్తి వివరాలను పరిశీలించండి..

సాక్షి ఎడ్యుకేషన్‌: అధునాతన సౌకర్యాలతో మండలానికి ఒక తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా గత నెల 11న ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పైలెట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించనున్న తెలంగాణ పబ్లిక్‌ స్కూల్స్‌ కోసం రూ. 500 కోట్లను కేటాయించారు. ఇప్పటికే మోడల్‌ స్కూల్‌, కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలలను మండలానికి ఒకటి చొప్పున కొనసాగిస్తున్నారు.

Gurukul Schools: బీసీ గురుకుల పాఠశాలల సొంత భవనాలకు చర్యలు..

మోడల్‌ స్కూల్స్‌ విషయంలో కేంద్రం తన బాధ్యతల నుంచి తప్పుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే వీటిని నిర్వహిస్తుండగా మండలానికి ఒక పాఠశాల ఏర్పాటు చేయలేకపోయింది. మోడల్‌ స్కూల్స్‌లో సీబీఎస్సీ సిలబస్‌తోనే విద్యా బోధన కొనసాగుతోంది. కస్తూర్బా పాఠశాలల్లో మాత్రం రాష్ట్ర సిలబస్‌ అమలు చేస్తున్నారు. కస్తూర్బా పాఠశాలలు పూర్తిగా బాలికల కోసం నిర్వహిస్తుండగా మోడల్‌ స్కూల్స్‌లో మాత్రం కో–ఎడ్యుకేషన్‌ అమలవుతోంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన తెలంగాణ పబ్లిక్‌ స్కూల్స్‌ ఏ విధంగా ఉండబోనున్నాయనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.

TRR College: టీఆర్‌ఆర్‌ కళాశాలలో రీసెర్చ్‌ సెంటర్‌

పైలెట్‌ ప్రాతిపదికన అని ప్రభుత్వం వెల్లడించడంతో ఏ జిల్లాకు ఎన్ని పాఠశాలలు ఏర్పాటు చేస్తారనే వివరాలు కూడా తెలియాల్సి ఉంది. ఇప్పటికే బీసీ, ఎస్సీ, మైనారిటీ సంక్షేమ గురుకుల పాఠశాలల ఏర్పాటుతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. కొన్ని చోట్ల విద్యార్థులు లేక పాఠశాలలు మూతబడే స్థితికి చేరుకున్నాయి. ఇలాంటి తరుణంలో తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి..

 

ఎన్ని తరగతులకు విద్యా బోధన అందిస్తారు, గురుకుల విధానం అమలు చేస్తారా అనే విషయంలో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేస్తేనే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఏది ఏమైనా తెలంగాణ పబ్లిక్‌ స్కూల్స్‌ విషయంలో అంతటా ఆసక్తికర చర్చ సాగుతుందని చెప్పవచ్చు.

#Tags